LOADING...
Maruti Suzuki: సామాన్యులకు గుడ్ న్యూస్.. 35 కిమీ మైలేజ్ ఇచ్చే మారుతీ హైబ్రిడ్ కారు
సామాన్యులకు గుడ్ న్యూస్.. 35 కిమీ మైలేజ్ ఇచ్చే మారుతీ హైబ్రిడ్ కారు

Maruti Suzuki: సామాన్యులకు గుడ్ న్యూస్.. 35 కిమీ మైలేజ్ ఇచ్చే మారుతీ హైబ్రిడ్ కారు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 27, 2026
10:16 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ కార్ల మార్కెట్‌లో 'మైలేజ్' అంటే వెంటనే గుర్తుకు వచ్చే బ్రాండ్ మారుతీ సుజుకీ. ఇప్పుడు అదే కంపెనీ తన రికార్డును తానే బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు చూసిన దానికంటే ఎక్కువ ఇంధన సామర్థ్యం కలిగిన కార్లను అభివృద్ధి చేస్తూ, ముఖ్యంగా తన ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి బాలెనో మోడల్‌లో సరికొత్త హైబ్రిడ్ టెక్నాలజీని తీసుకురానుంది.

వివరాలు

'సిరీస్ హైబ్రిడ్' టెక్నాలజీ అంటే ఏమిటి?

ప్రస్తుతం మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి మోడళ్లలో టయోటా నుంచి తీసుకున్న హైబ్రిడ్ టెక్నాలజీని మారుతీ ఉపయోగిస్తోంది. అయితే ఇప్పుడు కంపెనీ స్వయంగా 'సిరీస్ హైబ్రిడ్' టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ఇందులో ఇంజిన్ నేరుగా చక్రాలను తిప్పదు. అది ఒక జనరేటర్‌లా పనిచేసి బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఆ బ్యాటరీ ద్వారా ఎలక్ట్రిక్ మోటార్ పనిచేసి వాహనాన్ని నడిపిస్తుంది. దీనివల్ల మెకానికల్ కనెక్షన్ తక్కువగా ఉండి, ఇంధన వినియోగం గణనీయంగా తగ్గి మైలేజ్ భారీగా పెరుగుతుంది.

వివరాలు

బాలెనో హైబ్రిడ్: ఫీచర్లు, ప్రత్యేకతలు

మైలేజ్: ప్రస్తుత బాలెనో లీటరుకు 22-23 కి.మీ ఇస్తుండగా, కొత్త హైబ్రిడ్ వెర్షన్ 30 నుంచి 35 కి.మీ పైగా ఇవ్వగలదని అంచనా. ఫీచర్లు: వైర్‌లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్‌ప్లే వంటి ఆధునిక ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. అలాగే ఫ్రంట్ సీట్ వెంటిలేషన్ కూడా అందుబాటులోకి రావచ్చు. సేఫ్టీ: భారత్ NCAP ప్రమాణాలకు అనుగుణంగా భద్రతలో ఎలాంటి రాజీ లేకుండా రూపొందించనున్నట్లు సమాచారం.

Advertisement

వివరాలు

ధర సామాన్యులకు అందుబాటులో ఉంటుందా?

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్ల ధరలు సుమారు రూ.20 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే మారుతీ తన సొంత టెక్నాలజీతో ఈ ధరలను తగ్గించి సామాన్యులకు చేరువ చేయాలని చూస్తోంది. సాధారణ పెట్రోల్ వెర్షన్‌తో పోలిస్తే హైబ్రిడ్ వేరియంట్ ధర సుమారు రూ.1 లక్ష వరకు ఎక్కువగా ఉండొచ్చని సమాచారం. అంచనాల ప్రకారం బాలెనో హైబ్రిడ్ ధర రూ.8 లక్షల నుంచి రూ.13 లక్షల (ఆన్-రోడ్) మధ్య ఉండే అవకాశం ఉంది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ముందుగా మారుతి సుజుకి ఫ్రాంక్స్ మోడల్‌లో ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టి, అనంతరం 2027 మధ్య నాటికి బాలెనో హైబ్రిడ్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

Advertisement