Loading...
India-US: రక్షణ నుంచి ఏఐ వరకు.. భారత్-అమెరికా బంధానికి కొత్త బలం
రక్షణ నుంచి ఏఐ వరకు.. భారత్-అమెరికా బంధానికి కొత్త బలం

India-US: రక్షణ నుంచి ఏఐ వరకు.. భారత్-అమెరికా బంధానికి కొత్త బలం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 28, 2026
09:20 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీ ఎస్. పాల్ కపూర్ తెలిపారు. రక్షణ, అణుశక్తి, విశ్వసనీయ కృత్రిమ మేధ (ఏఐ), అత్యాధునిక సాంకేతిక రంగాల్లో ఇరు దేశాలు మరింత సన్నిహితంగా కలిసి పనిచేస్తున్నాయని ఆయన వెల్లడించారు. హూవర్ ఇన్‌స్టిట్యూషన్‌లో భారత్‌పై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ఈ విషయాలను వివరించారు. ఈ సమావేశానికి అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి కాండోలీజా రైస్, భారతదేశంలో అమెరికా మాజీ రాయబారి డేవిడ్ సి. ముల్ఫోర్డ్ కూడా హాజరయ్యారు.

వివరాలు 

వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా రెండు దేశాల్లో ఉపాధి అవకాశాలు

సమావేశం అనంతరం సోషల్ మీడియా వేదికగా స్పందించిన పాల్ కపూర్.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో భారత్-అమెరికా సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయని పేర్కొన్నారు.

ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా రెండు దేశాల్లో ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, సరఫరా వ్యవస్థ (సప్లై చైన్) మరింత పటిష్ఠమవుతోందన్నారు.

అలాగే ఈ సహకారం భారత్, అమెరికా మాత్రమే కాకుండా ఇండో-పసిఫిక్ ప్రాంత స్థిరత్వానికి కూడా కీలకంగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రక్షణ, అణుశక్తి, ఆధునిక టెక్నాలజీలో భారత్-అమెరికా సంబంధాలకు కొత్త దిశ

ADVERTISEMENT

వివరాలు 

కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారం

రక్షణ, అణుశక్తి, విశ్వసనీయ ఏఐ వంటి వ్యూహాత్మక రంగాల్లో సంయుక్త పరిశోధనలు, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, పెట్టుబడుల విస్తరణపై ఇరు దేశాలు ప్రత్యేక దృష్టి సారించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు.

గత ఏడాది కుదిరిన కీలక రక్షణ ఒప్పందం ప్రకారం భూమి, సముద్రం, గగనతలం, అంతరిక్షం, సైబర్‌స్పేస్ వంటి అన్ని కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారం మరింత విస్తరించనుంది.

ADVERTISEMENT

వివరాలు 

రక్షణ తయారీ, సాంకేతిక అభివృద్ధి, పెట్టుబడుల రంగాల్లో మరింత వేగం

2002 నుంచి భారతదేశం అమెరికా నుంచి అపాచీ, చినూక్ హెలికాప్టర్లు, సి-17, సి-130జే రవాణా విమానాలు, పి-8ఐ సముద్ర గస్తీ విమానాలు, ఎం777 హోవిట్జర్లు వంటి అత్యాధునిక రక్షణ సామగ్రిని కొనుగోలు చేసింది.

ఇటీవల భారత ప్రభుత్వం అమలు చేసిన విధానపరమైన సడలింపుల నేపథ్యంలో, భారత ప్రైవేట్ రక్షణ సంస్థలతో భాగస్వామ్య అవకాశాలను పరిశీలించేందుకు అమెరికా అధికారుల బృందం భారత్‌ను సందర్శించింది.

దీంతో రక్షణ తయారీ, సాంకేతిక అభివృద్ధి, పెట్టుబడుల విస్తరణ వంటి రంగాల్లో భారత్-అమెరికా సహకారం మరింత వేగం అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ADVERTISEMENT