Loading...
Michelin: భారత్‌లో తయారైన తొలి మిచెలిన్ కార్ టైర్.. 'ప్రైమసీ 5' గ్రాండ్ లాంచ్!
భారత్‌లో తయారైన తొలి మిచెలిన్ కార్ టైర్.. 'ప్రైమసీ 5' గ్రాండ్ లాంచ్!

Michelin: భారత్‌లో తయారైన తొలి మిచెలిన్ కార్ టైర్.. 'ప్రైమసీ 5' గ్రాండ్ లాంచ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2026
01:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ టైర్ తయారీ సంస్థ మిచెలిన్ (Michelin) భారత మార్కెట్లో తన కొత్త 'ప్రైమసీ 5' (Primacy 5) టైర్లను విడుదల చేసింది. ప్రత్యేకత ఏమిటంటే, మిచెలిన్ భారత్‌లో స్థానికంగా తయారు చేసిన తొలి ప్యాసింజర్ కార్ టైర్ ఇదే. ఈ కొత్త టైర్‌తో భారత ప్రీమియం టైర్ మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

వివరాలు

చెన్నై ప్లాంట్‌లో తయారీ

'ప్రైమసీ 5' టైర్లు మిచెలిన్ చెన్నైలోని ప్యాసింజర్ కార్ టైర్ తయారీ కేంద్రం నుంచి ఉత్పత్తి అవుతున్న తొలి మోడల్‌గా నిలిచాయి.

భారత రోడ్ల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా డిజైన్ చేసి, విస్తృతంగా పరీక్షించిన తర్వాత వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది.

ఈ టైర్లు 16 అంగుళాల నుంచి 22 అంగుళాల వీల్ సైజ్ కలిగిన సెడాన్లు, ఎస్‌యూవీలు కోసం రూపొందించారు.

అంతేకాకుండా పెట్రోల్‌, డీజిల్‌, హైబ్రిడ్‌, ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా ఇవి అనుకూలంగా ఉంటాయని మిచెలిన్ వెల్లడించింది.

వివరాలు

భద్రతే ప్రధాన ఆకర్షణ

'ప్రైమసీ 5'లో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని కంపెనీ పేర్కొంది.

తడి రోడ్లపై (వెట్ బ్రేకింగ్) ఈ టైర్లు కొత్తగా ఉన్నప్పుడు పోటీ బ్రాండ్లతో పోలిస్తే 8 మీటర్ల వరకు తక్కువ దూరంలో వాహనాన్ని ఆపగలవని తెలిపింది.

టైర్లు అరిగిన తర్వాత కూడా 9 మీటర్ల వరకు మెరుగైన బ్రేకింగ్ పనితీరు అందిస్తాయని వెల్లడించింది.

అలాగే పొడి రోడ్లపై (డ్రై బ్రేకింగ్) కూడా ఇతర టైర్లతో పోలిస్తే 4 మీటర్ల వరకు తక్కువ దూరంలో వాహనం ఆగేలా పనితీరు మెరుగుపరిచినట్లు కంపెనీ పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు

కంఫర్ట్‌, మైలేజ్‌లోనూ మెరుగుదల

భద్రతతో పాటు ప్రయాణ సౌకర్యం, మన్నికపైనా మిచెలిన్ ప్రత్యేక దృష్టి పెట్టింది.

పోటీ బ్రాండ్లతో పోలిస్తే 9 శాతం మెరుగైన కంఫర్ట్, అలాగే మునుపటి Primacy 4ST టైర్లతో పోలిస్తే 8 శాతం ఎక్కువ జీవితకాలం ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

అంతేకాదు రోలింగ్ రెసిస్టెన్స్‌ను 6.5 శాతం తగ్గించడం వల్ల ఇంధన వాహనాల్లో మెరుగైన ఫ్యూయల్ ఎఫిషియెన్సీ, ఎలక్ట్రిక్ వాహనాల్లో అధిక డ్రైవింగ్ రేంజ్ లభించే అవకాశం ఉందని తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు

ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా సిద్ధం

ఈ టైర్లను EV-రెడీగా రూపొందించినట్లు మిచెలిన్ వెల్లడించింది.

ఆధునిక ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉండే అధిక టార్క్‌, ఎక్కువ బరువును తట్టుకునేలా ప్రత్యేకంగా డిజైన్ చేసినప్పటికీ, ప్రయాణ సౌకర్యంలో ఎలాంటి రాజీ పడలేదని కంపెనీ తెలిపింది.

ప్రస్తుతం భారత మార్కెట్లో ఎస్‌యూవీలు, ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ టైర్లను అభివృద్ధి చేసినట్లు పేర్కొంది.

వివరాలు

ధర, విక్రయాలు

'ప్రైమసీ 5' టైర్ల ధర రూ.10,000 నుంచి ప్రారంభమవుతుంది.

2026 ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా ఉన్న మిచెలిన్ టైర్ సర్వీస్ స్టోర్లుతో పాటు సుమారు 800 అధీకృత డీలర్‌షిప్‌లలో ఇవి అందుబాటులోకి రానున్నాయి.

ఈ కొత్త ఉత్పత్తితో భారతదేశంలో స్థానిక తయారీ సామర్థ్యాన్ని మరింత విస్తరించడంతో పాటు, ప్రీమియం టైర్ విభాగంలో తన ఉత్పత్తుల శ్రేణిని బలోపేతం చేయాలని మిచెలిన్ భావిస్తోంది.

ADVERTISEMENT