LOADING...
BMW : బీఎండబ్ల్యూ నుంచి మోస్ట్ పవర్‌ఫుల్ క్రూయిజర్.. R20 బైక్ రాకకు గ్రీన్ సిగ్నల్!
బీఎండబ్ల్యూ నుంచి మోస్ట్ పవర్‌ఫుల్ క్రూయిజర్.. R20 బైక్ రాకకు గ్రీన్ సిగ్నల్!

BMW : బీఎండబ్ల్యూ నుంచి మోస్ట్ పవర్‌ఫుల్ క్రూయిజర్.. R20 బైక్ రాకకు గ్రీన్ సిగ్నల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 15, 2026
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ బైక్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్ నుంచి రానున్న కొత్త పెర్ఫార్మెన్స్ క్రూయిజర్ BMW R20 మార్కెట్‌లో త్వరలో విడదుల కానుంది. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ మార్కస్ ఫ్లాష్ స్వయంగా వెల్లడించారు. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి క్యామోఫ్లాజ్ లేకుండా ఉన్న పలు R20 బైక్‌లతో దిగిన ఫోటోలను పంచుకోవడంతో ఈ మోడల్ తుది దశ పరీక్షల్లో ఉందనే సంకేతాలు స్పష్టమయ్యాయి. ఫోటోల్లో కనిపించిన బైక్‌లు పూర్తిస్థాయి ప్రొడక్షన్ స్పెసిఫికేషన్‌లతో ఉండటం విశేషం. వీటిలో రియర్ వ్యూ మిర్రర్లు, రిఫ్లెక్టర్లు, నంబర్ ప్లేట్ హ్యాంగర్లు, సాధారణ ఎగ్జాస్ట్ సిస్టమ్ వంటి రోడ్డు నిబంధనలకు అనుగుణమైన భాగాలు అమర్చారు. దీన్ని బట్టి R20 అభివృద్ధి దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది.

వివరాలు

బ్లాక్ థీమ్‌లో ప్రొడక్షన్ వెర్షన్

ఈ బైక్‌ను మొదటగా 2024 మేలో జరిగిన కాంకోర్సో డి ఎలెగాంజా విల్లా డి ఎస్టే వేదికగా కాన్సెప్ట్ రూపంలో ఆవిష్కరించారు. అప్పట్లో "హాటర్ దాన్ పింక్" అనే ప్రత్యేక నియాన్ పింక్ కలర్‌లో ఈ బైక్‌ను ప్రదర్శించారు. అయితే ఇప్పుడు కనిపిస్తున్న ప్రొడక్షన్ వెర్షన్ మాత్రం పూర్తిగా బ్లాక్ థీమ్‌లో ఆకట్టుకుంటోంది. కాన్సెప్ట్ మోడల్‌లో ఉన్న ఎక్స్‌పోజ్డ్ షాఫ్ట్ డ్రైవ్, సింగిల్ సీట్ లేఅవుట్, మస్క్యులర్ అల్యూమినియం ఫ్యూయల్ ట్యాంక్, రౌండ్ LED హెడ్‌ల్యాంప్ వంటి కీలక డిజైన్ అంశాలను యథాతథంగా కొనసాగించారు. అయితే కాన్సెప్ట్ మోడల్‌తో పోలిస్తే కొన్ని ప్రాక్టికల్ మార్పులు కూడా చేశారు. భారీ మెగాఫోన్ ఎగ్జాస్ట్ స్థానంలో రోడ్డు వినియోగానికి అనువైన సాధారణ ఎగ్జాస్ట్‌ను అమర్చారు.

వివరాలు

అత్యధిక డిస్‌ప్లేస్‌మెంట్ కలిగిన బైక్‌గా గుర్తింపు

అలాగే రెగ్యులేటరీ నిబంధనల కోసం బార్ ఎండ్ మిర్రర్లు, రిఫ్లెక్టర్లు జోడించారు. ఈ బైక్ 17ఇంచుల వైర్-స్పోక్ వీల్స్‌పై రోడ్ బైయాస్డ్ టైర్లతో రానుంది. R20 బైక్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నది దీని భారీ 2,000 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ బాక్సర్ ఇంజిన్. ఇది ప్రస్తుతం BMW R18లో ఉపయోగిస్తున్న 1,802 సీసీ "బిగ్ బాక్సర్" ఇంజిన్‌కు మరింత పెద్ద వెర్షన్‌గా రూపొందించారు. దీంతో BMW Motorrad చరిత్రలోనే అత్యధిక డిస్‌ప్లేస్‌మెంట్ కలిగిన బైక్‌గా R20నిలవనుంది. అధికారిక పవర్ ఫిగర్లు ఇంకా వెల్లడించనప్పటికీ, ఇది 100 బీహెచ్‌పీకి పైగా పవర్‌తో పాటు సుమారు 160 నుంచి 180 ఎన్‌ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే అవకాశముందని ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Advertisement

వివరాలు

సాధారణ క్రూయిజర్‌ల కంటే మరింత స్పోర్టీ హ్యాండ్లింగ్

కాన్సెప్ట్ మోడల్‌లో క్రోమ్-మోలిబ్డినమ్ స్టీల్ ట్యూబ్‌లతో తయారైన బ్లాక్ డబుల్-లూప్ ఫ్రేమ్‌తో పాటు పూర్తిగా అడ్జస్టబుల్ ఓహ్లిన్స్ బ్లాక్‌లైన్ సస్పెన్షన్‌ను అందించారు. ప్రొడక్షన్ వెర్షన్‌లో కూడా అదే కాంపాక్ట్ జ్యామెట్రీని కొనసాగిస్తూ, సాధారణ క్రూయిజర్‌ల కంటే మరింత స్పోర్టీ హ్యాండ్లింగ్‌ను అందించేలా రూపొందిస్తున్నారు. గతంలో మార్కస్ ఫ్లాష్ ఈ బైక్‌ను "ప్యాషన్‌తో రూపొందించిన ప్రయోగాత్మక ప్రాజెక్ట్"గా అభివర్ణించారు. మార్కెట్ నుంచి మంచి స్పందన వస్తేనే ప్రొడక్షన్‌లోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఒకటి కాదు, పలు టెస్ట్ యూనిట్లు కనిపించడంతో BMWఈ మోడల్‌ను పరిమిత ఎడిషన్‌గా కాకుండా పూర్తి స్థాయి ఉత్పత్తి మోడల్‌గా తీసుకురావడానికి సిద్ధమైందని స్పష్టమవుతోంది. ఇది R18కు ప్రత్యామ్నాయం కాకుండా, దానికి అదనపు ప్రీమియం మోడల్‌గా మార్కెట్లోకి వచ్చే అవకాశముంది.

Advertisement