LOADING...
Car sales : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. ఒకే రోజులో 41,000 కార్ల అమ్మకాలు!
జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. ఒకే రోజులో 41,000 కార్ల అమ్మకాలు!

Car sales : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. ఒకే రోజులో 41,000 కార్ల అమ్మకాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 23, 2025
02:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

జీఎస్టీ 2.0 సంస్కరణలు అమలవ్వడం, నవరాత్రి పండుగలు ప్రారంభమవ్వడంతో దేశవ్యాప్తంగా ఆటో మొబైల్ మార్కెట్ ఊపందుకుంది. దేశంలోని అన్ని కార్ల షోరూమ్‌లలో వినియోగదారుల రద్దీ పెరిగి, డీలర్లు భారీగా అమ్మకాలు నమోదు చేశారు. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్ వంటి ప్రముఖ కంపెనీలు రికార్డు స్థాయి సేల్స్ సాధించాయి.

Details

మారుతీ, హ్యుందాయ్ రికార్డు సేల్స్ 

జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రభావంతో సెప్టెంబర్ 22న నవరాత్రి మొదటి రోజే మారుతీ సుజుకీ రిటైల్ అమ్మకాలు 30,000 యూనిట్లను దాటుతాయని కంపెనీ వెల్లడించింది. మరోవైపు హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ డీలర్లు కేవలం ఒక్క రోజులోనే దాదాపు 11,000 కార్ల బిల్లింగ్ పూర్తి చేశారు. గత ఐదేళ్లలో ఒకే రోజున ఇంత పెద్ద ఎత్తున అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా హెచ్‌ఎంఐఎల్ సీఓఓ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు అందించడంలో ముందుండడం మాకు ఆనందంగా ఉంది. పండుగ డిమాండ్ కొనసాగుతుందని ఆశిస్తున్నాం. వినియోగదారులకు మరిన్ని మెరుగైన ఆఫర్లు అందించడానికి కట్టుబడి ఉన్నామని అన్నారు.

Details

చిన్న కార్ల బుకింగ్‌ల పెరుగుదల 

జీఎస్టీ రేట్లు తగ్గడంతో షోరూమ్‌ల వద్ద వినియోగదారుల రద్దీ గణనీయంగా పెరిగింది. నవరాత్రి, జీఎస్టీ సంస్కరణల మొదటి రోజే మారుతీ సుజుకీ డీలర్లు 80,000 వరకు విచారణలు స్వీకరించారు. ముఖ్యంగా తగ్గిన ధరల కారణంగా చిన్న కార్ల బుకింగ్‌లు 50 శాతం పెరిగాయని కంపెనీ వెల్లడించింది. ఇతర కంపెనీల అంచనాలు మారుతీ, హ్యుందాయ్ మాత్రమే కాకుండా టాటా మోటార్స్ సహా ఇతర వాహన తయారీ సంస్థలు కూడా ఇలాంటి సేల్స్ నమోదు చేస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Details

 డీలర్ల ఆనందం 

అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్‌తో ఆటోమొబైల్ డీలర్లు హర్షం వ్యక్తం చేశారు. ఆటోమొబైల్ డీలర్ల ఫెడరేషన్ (FADA) ప్రకారం, సోమవారం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. జీఎస్టీ సంస్కరణలు వినియోగదారుల కొనుగోలు శక్తిని పెంచుతాయని, ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు ఇస్తాయని వారు అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పండుగ సీజన్‌లో జీఎస్టీ సంస్కరణలు అమలు చేయడం ద్వారా వినియోగదారులకు పెద్ద సహకారం అందించారని డీలర్లు ప్రశంసించారు.