Maruti Suzuki: జీఎస్టీ తగ్గింపు.. సేల్స్ లో రికార్డు స్థాయికి చేరిన మారుతీ సుజుకీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఆటో మొబైల్ దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ (MSIL) భారీ మైలురాయిని అధిగమించింది. కంపెనీ తన మొత్తం ఉత్పత్తి శ్రేణిలో 3.5 లక్షలకుపైగా బుకింగ్స్ అందుకుంది. వీటిలో దాదాపు 2.5 లక్షల బుకింగ్స్ 18% జీఎస్టీ స్లాబ్‌లోకి వచ్చే వాహనాలవేనని కంపెనీ వెల్లడించింది. చిన్న కార్లకు జీఎస్టీ తగ్గింపు ప్రభావం తాజాగా చిన్న కార్లపై జీఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించడంతో పండుగ సీజన్ ముందుగా ఆటోమొబైల్ మార్కెట్‌లో డిమాండ్ గణనీయంగా పెరిగింది.
Details
అక్టోబర్‌లో 30% రిటైల్ సేల్స్ వృద్ధి
మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్.సి. భార్గవ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపు చిన్న కార్ల విభాగాన్ని తిరిగి చైతన్యపరిచింది. ధరల భారం కారణంగా మార్కెట్ నుంచి దూరంగా ఉన్న వినియోగదారులు మళ్లీ షోరూమ్‌లకు వస్తున్నారు. పన్ను తగ్గింపుతో పాటు పండుగ ఆఫర్లు కూడా అమ్మకాల పెరుగుదలకు దోహదం చేశాయని తెలిపారు. మారుతీ సుజుకీ అక్టోబర్‌లో రిటైల్ సేల్స్‌లో 30% వృద్ధి సాధించింది. ముఖ్యంగా చిన్న కార్లే అమ్మకాలలో ఎక్కువ శాతం వాటా సాధించాయి. ప్రస్తుతం 18% జీఎస్టీ స్లాబ్‌లో ఉన్న వాహనాలు కంపెనీ మొత్తం అమ్మకాలలో 69% వాటా కలిగి ఉన్నాయి. రాబోయే నెలల్లో ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని అంచనా.
Details
రూరల్ ఇండియా నుంచి భారీ స్పందన
మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ & సేల్స్) పార్థో బెనర్జీ తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం బుకింగ్స్‌లో 65% టాప్ 100 నగరాల వెలుపల ప్రాంతాల నుంచి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నాయి. ద్విచక్ర వాహన యజమానులు కూడా ఇప్పుడు చిన్న కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన చెప్పారు. SUV విభాగంలోనూ చురుకుదనం ఇటీవల లాంచ్ చేసిన మారుతీ సుజుకీ 'విక్టోరిస్' ఎస్‌యూవీ ఇప్పటికే 33,000 బుకింగ్స్ అందుకుంది. ఈ మోడల్‌కు ప్రస్తుతం కొన్ని వారాల వెయిటింగ్ పీరియడ్ కొనసాగుతోంది.