Loading...
Harley-Davidson: 1950ల హార్లే-డేవిడ్‌సన్ బైక్‌లకు నివాళిగా కొత్త 'డెడ్‌వుడ్' క్రూయిజర్.. ధర రూ.17.32 లక్షలు
1950ల హార్లే-డేవిడ్‌సన్ బైక్‌లకు నివాళిగా కొత్త 'డెడ్‌వుడ్' క్రూయిజర్.. ధర రూ.17.32 లక్షలు

Harley-Davidson: 1950ల హార్లే-డేవిడ్‌సన్ బైక్‌లకు నివాళిగా కొత్త 'డెడ్‌వుడ్' క్రూయిజర్.. ధర రూ.17.32 లక్షలు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 15, 2026
04:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ అమెరికన్ మోటార్‌ సైకిల్ తయారీ సంస్థ హార్లే-డేవిడ్‌సన్ తన క్రూయిజర్ బైక్‌ల శ్రేణిని మరింత విస్తరించింది. ఇందులో భాగంగా ఫ్యాక్టరీలోనే బాబర్ స్టైల్‌లో రూపొందించిన కొత్త డెడ్‌వుడ్ (Deadwood) మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. 2026 మోడల్‌గా తీసుకొచ్చిన ఈ బైక్, రెండో ప్రపంచ యుద్ధం అనంతరం 1950లలో విపరీతమైన ఆదరణ పొందిన సరళమైన హార్లే-డేవిడ్‌సన్ బైక్‌లకు నివాళిగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ బైక్‌ను అమెరికా, కెనడా మార్కెట్లలో మాత్రమే విక్రయించనున్నారు. దీని ధర 17,999 డాలర్లు (పన్నులు మినహా సుమారు రూ.17.32 లక్షలు)గా నిర్ణయించారు.

వివరాలు

అద్భుతమైన ఫీచర్లు..

ఈ కొత్త డెడ్‌వుడ్ బైక్‌కు డెనిమ్ బ్లాక్ ఒక్కటే కలర్ ఆప్షన్ అందుబాటులో ఉంది.

ఇంజిన్, ఎగ్జాస్ట్, హ్యాండిల్‌బార్, ఫోర్క్, వీల్స్, లైటింగ్ వంటి దాదాపు అన్ని భాగాలకు బ్లాక్ ఫినిష్ ఇచ్చారు.

క్రోమ్ ఫినిష్‌ను కేవలం లోయర్ రాకర్ కవర్లు, పుష్‌రాడ్ ట్యూబ్‌లకు మాత్రమే పరిమితం చేశారు.

డిజైన్ పరంగా చూస్తే సోలో 'టక్-అండ్-రోల్' సీటు, వైర్-స్పోక్ వీల్స్, చిన్న పరిమాణంలోని చాప్డ్ విండ్‌స్క్రీన్, అలాగే సాడిల్‌బ్యాగ్‌లు లేకుండా సాఫ్‌టెయిల్ బైక్‌ల హార్డ్‌టెయిల్ శైలిని గుర్తు చేసే రియర్ సెక్షన్‌ను ఇందులో అందించారు.

వివరాలు

భద్రతా ఫీచర్లు ఇవే..

ఇంజిన్ విషయానికి వస్తే, ఈ బైక్‌లో హార్లే-డేవిడ్‌సన్‌కు చెందిన 1,923 సీసీ మిల్వాకీ-ఎయిట్ V-ట్విన్ ఇంజిన్‌ను అమర్చారు.

ఇది 98 హెచ్‌పీ పవర్‌తో పాటు 163 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు.

అలాగే 2-ఇన్-టు-1 ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను కూడా అందించారు. అవసరమైతే హార్లే-డేవిడ్‌సన్ స్క్రీమిన్' ఈగిల్ పెర్ఫార్మెన్స్ పార్ట్స్‌తో ఈ బైక్‌ను అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

రెట్రో లుక్‌తో వచ్చినప్పటికీ ఫీచర్ల విషయంలో మాత్రం ఈ బైక్ ఆధునిక సాంకేతికతను కలిగి ఉంది.

ఇందులో కార్నరింగ్ ఏబీఎస్, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, డ్రాగ్ టార్క్ స్లిప్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

ADVERTISEMENT

వివరాలు

త్వరలోనే బైక్ విక్రయాలు ప్రారంభం..

అదనంగా రోడ్, స్పోర్ట్, రైన్ వంటి రైడింగ్ మోడ్‌లను కూడా అందించారు.

ఈ కొత్త డెడ్‌వుడ్ మోటార్‌సైకిల్‌ను ఆగస్టు 7న జరిగే స్టర్జిస్ మోటార్‌సైకిల్ ర్యాలీలో ప్రజల ముందుకు తీసుకురానున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద బైకర్‌ల సమ్మేళనంగా పేరుగాంచిన ఈ ర్యాలీకి ప్రతి ఏడాది 4.5 లక్షలకు పైగా రైడర్లు హాజరవుతారు.

ఈ కార్యక్రమంలో తొలి ప్రదర్శన అనంతరం అమెరికా, కెనడా మార్కెట్లలో ఈ బైక్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

ADVERTISEMENT