హ్యార్లీ-డేవిడ్సన్ ఎక్స్440 ధర భారీగా పెంపు.. నేడు కొంటే రూ.10వేలు తగ్గింపు!
హీరో మోటోకార్ప్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన అన్ని ఈ బైక్స్ వేరియంట్ల ధరను రూ.10,500 పెంచుతున్నట్లు బుధవారం ఆ సంస్థ వెల్లడించింది. గత నెల మార్కెట్లోకి వచ్చిన ఈ బైక్ ఎక్స్ షోరూం ధరల శ్రేణి రూ. 2.29 లక్షల నుంచి 2.69 లక్షలుగా ఉంది. ప్రస్తుతం ధరల పెంపుతో ఈ బైక్ ప్రారంభం ధర రూ. 2,39,500లకు చేరుకుంది. హ్యార్లీ డేవిడ్సన్ ఎక్స్ 440 ధరను కూడా హీరో మోటోకార్ప్ పెంచేసింది. అయితే గురువారం వరకు పాత ధరలకే బైక్ లభిస్తుందని హీరో మోటోకార్ప్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది
రూ.5వేలు చెల్లించి అన్ లైన్ లో బుక్ చేసుకొనే అవకాశం
రూ.5 వేలు చెల్లించి ఆన్ లైన్‌లో బుక్ చేసుకోవచ్చని కంపెనీ సీఈఓ నిరంజన్ గుప్తా పేర్కొన్నారు. రాజస్థాన్ లోని నిమ్రాన వద్దనునున్న హీరో మోటోకార్ప్ గార్డెన్ ఫ్యాక్టరీలో హ్యార్టీ-డేవిడ్సన్ ఎక్స్ 440 బైకులు తయారుకానున్నాయి. సెప్టెంబర్ నుంచి ఆ బైకులను తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే అక్టోబర్ నుంచి డెలివరీలు చేయనున్నారు. భారత్ లో హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంతో హార్లీ-డేవిడ్సన్ బైకులను విక్రయిస్తున్నారు. కస్టమర్లు అభిరుచులకు అనుగుణంగానే ఈ బైకులను సిద్ధం చేస్తున్నామని కంపెనీ ప్రకటించింది.