Royal Enfield: జూలై నెలలో అమ్మకాల మోత మోగించిన రాయల్ ఎన్‌ఫీల్డ్
2023 జూలై నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 73,117 యూనిట్ల అమ్మకాలతో ఏకంగా 32శాతం పెరిగాయి. ఎగుమతులు 22శాతం తగ్గి 7,055 యూనిట్లకు చేరుకున్నప్పటికీ, దాని దేశీయ విక్రయాలు 42శాతం పెరిగి, 66,062 యూనిట్లకు చేరుకోవడం విశేషం. జూన్, జూలై నెలల్లో హార్లే-డేవిడ్‌సన్, ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ నుండి గట్టి పోటీని ఎదుర్కొన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 24శాతం వార్షిక వృద్ధిని సూచిస్తూ 300,823 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఏది ఏమైనప్పటికీ ఎగుమతులు మాత్రం క్షీణించాయి.
రాబోయే నెలలో కొత్త సిరీస్ ను తీసుకురావడానికి ప్లాన్
రాబోయే నెలలో కొత్త సిరీస్ ను విడుదల చేయడానికి రాయల్ ఎన్ ఫీల్డ్ సిద్ధమైంది. కొత్త తరం J-సిరీస్ తో షాట్‌గన్ 350, హిమాలయన్ 450, క్లాసిక్ 650లతో త్వరలో ముందుకురానుంది. త్వరలో వీటి లాంచ్ ఈవెంట్ కు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను కూడా తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 29శాతం తగ్గి 27,590 మోటార్‌సైకిళ్లను విదేశాలకు పంపించారు. కంపెనీ తన వృద్ధి పథాన్ని కొనసాగించేందుకు దీర్ఘకాలిక వ్యూహాత్మక లక్ష్యాలపై దృష్టి సారిస్తోంది.