Hero Karizma XM 210: సరికొత్త లుక్‌లో హీరో 'కరిజ్మా'.. లాంచ్ తేదీపై క్లారిటీ!
కరిజ్మా బైక్స్ కు ఇండియాలో మంచి క్రేజ్ ఉంది. కరిజ్మా మోడల్‌తో హీరో మోటోకార్ప్ సంస్థ గతంలో వచ్చిన విషయం తెలిసిందే. తక్కువ సమయంలోనే ఈ మోడల్ కు విపరీతమైన అదరణ లభించింది. కొద్దికాలం తర్వాత సేల్స్ డ్రాప్ కావడంతో ఈ మోడల్ ను 2020లో హీరో సంస్థ డిస్ కంటిన్యూ చేసింది. ప్రస్తుతం ఈ బైకును మళ్లీ తీసుకొచ్చేందుకు గట్టి ఏర్పాట్లను చేస్తోంది. కరిష్మా ఎక్స్ఎంఆర్ పేరుతో మార్కెట్లో ఈనెల 29న ఈ బైక్ లాంచ్ అవుతుందని సంస్థ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆ బైకు తాజా టీజర్‌ను సంస్థ రిలీజ్ చేసింది. ఆ టీజర్లో బైక్ ఫ్యూయెల్ ట్యాంక్,సెమీ ఫైరింగ్, వెహికల్‌కి సంబంధించిన క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్ కనిపిస్తోంది.
హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 మోడల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా హృతిక్ రోషన్
హీరో కరిజ్మా ఎక్స్ఎంఆర్ 210 లో 210 సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ తో పాటు డ్యుయెల్ ఛానెల్ ఏబీఎస్ సెటప్ ఉండనుంది. ఈ బైక్ 25 హెచ్‌పీ పవర్ ను, 30 ఎన్ఎం టార్క్ ను జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్‌తో పాటు ఫ్రెంట్, రేర్ వీల్స్ కు డిస్క్ బ్రేక్స్ ఉండనున్నాయి. ఈ బైక్ కు సంబంధించిన వివరాలపై సంస్థ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఈ మోడల్ కు బ్యాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ను సంస్థ నియమించిన విషయం తెలిసిందే.