Loading...
Hero Impulse: ఎక్స్‌పల్స్ కంటే తక్కువ ధరకే కొత్త ఆఫ్‌రోడర్.. రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్!
ఎక్స్‌పల్స్ కంటే తక్కువ ధరకే కొత్త ఆఫ్‌రోడర్.. రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్!

Hero Impulse: ఎక్స్‌పల్స్ కంటే తక్కువ ధరకే కొత్త ఆఫ్‌రోడర్.. రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 23, 2026
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

హీరో మోటోకార్ప్ లైనప్‌లో ఒకప్పుడు మంచి క్రేజ్ సంపాదించిన ఐకానిక్ బైక్ 'ఇంపల్స్' (Impulse) మళ్లీ కొత్త రూపంలో మార్కెట్లోకి రాబోతోందా? ప్రస్తుతం లీకైన డిజైన్ పేటెంట్ చిత్రాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. భారత మార్కెట్‌లో ఆఫ్‌రోడ్, అడ్వెంచర్ బైక్‌లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో హీరో మోటోకార్ప్ ఓ కొత్త డ్యూయల్-స్పోర్ట్ మోటార్‌సైకిల్ డిజైన్‌కు పేటెంట్ చేయించింది. దీంతో ఈ కొత్త బైక్ ఇంపల్స్‌కు రీ-ఎంట్రీ కావచ్చనే ప్రచారం మొదలైంది. లీకైన పేటెంట్ చిత్రాలను పరిశీలిస్తే.. ఈ బైక్ డిజైన్ ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎక్స్‌పల్స్ (Xpulse) మోడళ్లకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఇందులో ఆయిల్ కూలర్ లేకపోవడంతో పాటు చిన్న ఎయిర్-కూల్డ్ ఇంజిన్, కిక్ స్టార్టర్ కనిపిస్తున్నాయి.

వివరాలు

పేటెంట్ డిజైన్‌లో ఇంజిన్‌కు ఎడమవైపు 'ఫ్యూయల్ టాప్'..

వీటిని బట్టి 150 సీసీ నుంచి 200 సీసీ సామర్థ్యంతో తేలికైన, తక్కువ ధరలో లభించే ఆఫ్‌రోడ్ బైక్‌ను తీసుకురావాలని హీరో మోటోకార్ప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదే జరిగితే ప్రస్తుతం ఉన్న Xpulse 200 4V, Xpulse 210 కంటే తక్కువ ధరలో ఈ కొత్త బైక్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఎంట్రీ లెవెల్ అడ్వెంచర్ టూరర్‌గా సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా దీనిని రూపొందించే అవకాశం కనిపిస్తోంది.

పేటెంట్ డిజైన్‌లో ఇంజిన్‌కు ఎడమవైపు 'ఫ్యూయల్ టాప్' కనిపిస్తోంది. దీంతో ఈ బైక్ కార్బొరేటర్ సెటప్‌తో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

వివరాలు

ఎక్స్‌షోరూమ్ ధర ఎంతంటే..

ప్రస్తుతం అమల్లో ఉన్న బీఎస్ ఉద్గార నిబంధనల ప్రకారం కార్బొరేటర్ ఇంజిన్లకు భారత్‌లో అనుమతి లేదు.

దీంతో కార్బొరేటర్ ఇంజిన్లు అనుమతించే విదేశీ మార్కెట్ల కోసం ఈ మోడల్‌ను అభివృద్ధి చేస్తుండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు పేటెంట్ చిత్రాల్లో ఫ్రంట్ నంబర్ ప్లేట్, చీర గార్డ్ వంటి భాగాలు కూడా కనిపిస్తున్నాయి.

దీంతో భారత మార్కెట్ కోసం హీరో మోటోకార్ప్ వేరే వెర్షన్‌ను సిద్ధం చేస్తుండవచ్చని భావిస్తున్నారు.

ఇక హీరో మోటోకార్ప్ తొలిసారిగా 'ఇంపల్స్' బైక్‌ను 2011 అక్టోబర్‌లో రూ.66,800 ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధరతో మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ADVERTISEMENT