VIDA V2: హీరో మోటోకార్ప్ VIDA V2 శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది
ప్రఖ్యాత ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, తన తాజా విద్యుత్ స్కూటర్ 'విడా వీ2'ను మార్కెట్లోకి పరిచయం చేసింది. ఈ స్కూటర్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. దీని ప్రారంభ ధర రూ.96,000 ఉండగా, హైఎండ్ మోడల్ ధర రూ.1,35,000 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. విడా వీ2 స్కూటర్ రిమూవబుల్ బ్యాటరీ సదుపాయంతో వస్తుంది. గరిష్ఠ వేగం గంటకు 90 కిలోమీటర్లు. ఒకసారి ఛార్జ్ చేయగలిగిన ఈ స్కూటర్ 165 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది.
కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్
ఈ స్కూటర్‌లో కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్, కస్టమ్ రైడింగ్ మోడ్ వంటి ప్రత్యేక ఫీచర్లను అందించారు. ధర, బ్యాటరీ సామర్థ్యం పరంగా టీవీఎస్ ఐక్యూబ్ 2.2, బజాజ్ చేతక్ 2903 మోడళ్లతో హీరో విడా వీ2 పోటీ పడే అవకాశం ఉంది. ఈ కొత్త విద్యుత్ వాహనం మార్కెట్లోకి అడుగుపెట్టడం హీరో మోటోకార్ప్‌కి విద్యుత్ వాహన రంగంలో కీలకమైన మైలురాయిగా భావించబడుతోంది అని, కంపెనీ సీఈఓ నిరంజన్ గుప్తా తెలిపారు.