Loading...
Hero Splendor Plus Price: భారీగా పెరిగిన హీరో స్ల్పెండర్‌ ధర... సామాన్యుడికి కష్టమే
భారీగా పెరిగిన హీరో స్ల్పెండర్‌ ధర... సామాన్యుడికి కష్టమే

Hero Splendor Plus Price: భారీగా పెరిగిన హీరో స్ల్పెండర్‌ ధర... సామాన్యుడికి కష్టమే

వ్రాసిన వారు Balachander Sharma
Nov 20, 2026
05:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

రోజువారీ ప్రయాణాలకు తక్కువ ఖర్చుతో కూడిన బైక్ కోసం చూస్తున్న మధ్యతరగతి ప్రజలకు హీరో మోటోకార్ప్ షాక్ ఇచ్చింది. దేశంలో అత్యధిక ఆదరణ ఉన్న స్ప్లెండర్ ప్లస్ మోడల్ ధరలను పెంచింది. వేరియంట్‌ను బట్టి రూ.1,135 నుంచి రూ.3,086 వరకు అదనపు భారం పడనుంది. ముఖ్యంగా స్పెషల్ ఎడిషన్ ధర అత్యధికంగా పెరిగింది. ధరల మార్పుతో పాటు కొన్ని కొత్త రంగులను కూడా పరిచయం చేసింది. అయితే బైక్ ఇంజిన్, పనితీరులో ఎలాంటి మార్పులు చేయలేదు.

Details

నాలుగు వేరియంట్లు.. మారిన ధరలు

ప్రస్తుతం స్ప్లెండర్ ప్లస్ నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. బేస్ డ్రమ్ వేరియంట్ ధర రూ.77,777 నుంచి రూ.78,912కు చేరింది.

i3S మోడల్ ధర కూడా రూ.78,910 నుంచి రూ.80,045కు పెరిగింది. గతంలో బ్లాక్ అండ్ యాక్సెంట్ పేరుతో విక్రయించిన స్పెషల్ ఎడిషన్‌కు ఇప్పుడు రూ.3,086 పెంపు వర్తించింది.

దీంతో దాని ధర రూ.78,580 నుంచి రూ.81,666కు చేరింది. 125 మిలియన్ ఎడిషన్ ధర రూ.80,531 నుంచి రూ.81,666కు పెరిగింది.

Details

కొత్త రంగులు.. ప్రత్యేక ఫీచర్లు

స్పెషల్ ఎడిషన్‌లో మ్యాట్ గ్రే, మ్యాట్ వెర్నియర్ గ్రే, క్యాండీ బ్లేజింగ్ రెడ్ అనే మూడు కొత్త రంగులను అందుబాటులోకి తెచ్చింది.

ఇక XTEC డ్రమ్ వేరియంట్ ధర రూ.82,418 కాగా, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మోడల్ ధర రూ.85,461గా ఉంది.

బ్లూటూత్ కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, రియల్ టైమ్ మైలేజ్ సమాచారం ఈ వేరియంట్ ప్రత్యేకతలు.

XTEC 2.0 ధర రూ.84,549. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, హజార్డ్ లైట్ ఫంక్షన్ ఉన్నాయి. అయితే దీనిలో డ్రమ్ బ్రేక్ మాత్రమే లభిస్తుంది.

ADVERTISEMENT

Details

ఫ్లెక్స్ మోడల్ ధర కూడా పెరిగింది

ఇథనాల్‌తో నడిచే స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ధర కూడా రూ.1,332 పెరిగి రూ.84,042కు చేరింది.

ఈ మోడల్ గతంలో రూ.82,710కు అందుబాటులో ఉండేది. E20 నుంచి E85 వరకు ఇథనాల్ మిశ్రమ ఇంధనాలతో నడిచే సామర్థ్యం దీనికి ఉంది.

E85 ఇంధనంతో 8.6 హెచ్‌పీ శక్తి, 8.3 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ధరల పెంపు తర్వాత కూడా స్ప్లెండర్ ప్లస్ 100సీసీ విభాగంలో పోటీని కొనసాగిస్తోంది.

అయితే హోండా షైన్ 100 ధర రూ.65,642, బజాజ్ ప్లాటినా రూ.70,511, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ రూ.59,477 నుంచే ప్రారంభమవుతున్నాయి.

ADVERTISEMENT