Loading...
Hero Vida : మార్కెట్లోకి హీరో విడా కొత్త ఈ-స్కూటర్.. ఒక్క చార్జ్‌తో 187 కి.మీ. రేంజ్!
మార్కెట్లోకి హీరో విడా కొత్త ఈ-స్కూటర్.. ఒక్క చార్జ్‌తో 187 కి.మీ. రేంజ్!

Hero Vida : మార్కెట్లోకి హీరో విడా కొత్త ఈ-స్కూటర్.. ఒక్క చార్జ్‌తో 187 కి.మీ. రేంజ్!

వ్రాసిన వారు Moogati Shabari
Jul 15, 2026
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్.. తన ఎలక్ట్రిక్ బ్రాండ్ 'విడా' కింద మరో కొత్త ఈ-స్కూటర్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎక్కువ రేంజ్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని 'విడా VX2 ప్లస్ 4.4 kWh' వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్‌ను ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే గరిష్ఠంగా 187 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ మోడల్ ఎక్స్‌షోరూమ్ ధర (న్యూఢిల్లీ) రూ.1.44 లక్షలుగా నిర్ణయించింది. కొత్త విడా VX2 ప్లస్ స్కూటర్‌లో 2.2 kWh సామర్థ్యం గల రెండు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌లను అమర్చారు. ఈ స్కూటర్ గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

వివరాలు

3.1 సెకన్లలోనే 40 కిలోమీటర్ల వేగం..

అలాగే కేవలం 3.1 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

పోర్టబుల్ చార్జర్‌తో సుమారు 3 గంటల 30 నిమిషాల్లో 80 శాతం వరకు బ్యాటరీ చార్జ్ అవుతుంది.

డీసీ ఫాస్ట్ చార్జర్‌ను ఉపయోగిస్తే కేవలం 65 నిమిషాల్లోనే 80 శాతం వరకు చార్జింగ్ పూర్తి చేయవచ్చు.

ఫీచర్ల పరంగా చూస్తే.. ఈ స్కూటర్‌లో 27.2 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, డిస్క్, డ్రమ్ బ్రేక్‌లు, స్మార్ట్ కనెక్టివిటీ వంటి సౌకర్యాలు ఉన్నాయి.

వినియోగదారుల కొనుగోలు భారాన్ని తగ్గించేందుకు 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్' (BaaS) మోడల్‌లో కూడా ఈ స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

వివరాలు

ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం..

దీంతో బ్యాటరీని ఇంట్లోనే సులభంగా చార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

రేంజ్‌పై ఉండే ఆందోళన కూడా తగ్గుతుందని కంపెనీ తెలిపింది. ఈ కొత్త ఈ-స్కూటర్ జులై నెలాఖరు నుంచి దేశవ్యాప్తంగా విడా డీలర్‌షిప్‌లలో విక్రయాలకు అందుబాటులోకి రానుంది.

ఇదే స్కూటర్ సిరీస్‌తో సుదీర్ఘ ప్రయాణం చేసి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్న విషయాన్ని కూడా కంపెనీ గుర్తు చేసింది.

ADVERTISEMENT