Page Loader
Vida Vx2: తక్కువ ధరలో లభించే విడా వీఎక్స్2 ఎలక్ట్రిక్ స్కూటర్.. మధ్య తరగతి వినియోగదారులకు మంచి ఎంపిక!
తక్కువ ధరలో లభించే విడా వీఎక్స్2 ఎలక్ట్రిక్ స్కూటర్.. మధ్య తరగతి వినియోగదారులకు మంచి ఎంపిక!

Vida Vx2: తక్కువ ధరలో లభించే విడా వీఎక్స్2 ఎలక్ట్రిక్ స్కూటర్.. మధ్య తరగతి వినియోగదారులకు మంచి ఎంపిక!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 07, 2025
10:39 am

ఈ వార్తాకథనం ఏంటి

హీరో మోటోకార్ప్ తాజాగా విడా వీఎక్స్2 అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లతో ఈ స్కూటర్ అందుబాటైన ధరలో వినియోగదారులకు లభిస్తోంది. ఈ స్కూటర్‌ను స్టాండర్డ్ వెర్షన్‌తో పాటు 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS)' ప్లాన్ కింద కూడా కొనుగోలు చేసే వీలుంది. ఇప్పుడు దీని ధరలు, ముఖ్యమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై ఓసారి పరిశీలించుదాం. ధర వివరాలు హీరో విడా వీఎక్స్2 రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది - విడా వీఎక్స్2 గో,విడా వీఎక్స్2 ప్లస్. స్టాండర్డ్ ప్లాన్ ప్రకారం వీఎక్స్2 గో మోడల్ ధర రూ.99,000 కాగా, వీఎక్స్2 ప్లస్ ధర రూ.1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్).

వివరాలు 

ప్రయాణ దూరం (రేంజ్) 

ఇక BaaS ప్లాన్‌లో తీసుకుంటే, విడా వీఎక్స్2 గో ధర రూ.59,000,వీఎక్స్2 ప్లస్ ధర రూ.64,000 మాత్రమే. విడా వీఎక్స్2 గో వేరియంట్ 2.2 కిలోవాట్ అవర్ బ్యాటరీతో వస్తుంది. ఈబ్యాటరీ పూర్తి ఛార్జ్ అయిన తర్వాత గరిష్టంగా 92కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అదే విధంగా,వీఎక్స్2 ప్లస్ వేరియంట్‌లో 3.4కిలోవాట్ అవర్ బ్యాటరీ ఏర్పాటు చేయబడింది, ఇది ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత 142కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఛార్జింగ్ సమయం విడా వీఎక్స్2 బ్యాటరీను ఫాస్ట్ ఛార్జర్‌తో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 1గంట సమయం పడుతుంది. సాధారణ ఛార్జింగ్ పద్ధతిలో అదే స్థాయిలో ఛార్జ్ చేయడానికి దాదాపు 6గంటల సమయం అవసరం అవుతుంది.

వివరాలు 

ముఖ్య ఫీచర్లు 

విడా వీఎక్స్2 ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. శక్తివంతమైన హెడ్‌లైట్లు, డేయ్‌టైమ్ రన్నింగ్ లైట్లతో (DRLs) స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇది గ్రే, బ్లూ, ఎరుపు, పసుపు, నలుపు సహా మొత్తం 7 రంగులలో లభ్యమవుతోంది. ఇందులో LCD డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, జీపీఎస్ ట్రాకింగ్, రిమోట్ ఇమ్మొబిలైజేషన్, క్లౌడ్ కనెక్టివిటీ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. అదనంగా అండర్‌సీట్ స్టోరేజ్, వెనుక ప్రయాణికుని కోసం బ్యాక్‌రెస్ట్, డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటి హై క్వాలిటీ ఫీచర్లు ఈ స్కూటర్‌లో ఉన్నాయి. రైడర్ భద్రతను దృష్టిలో పెట్టుకుని డిస్క్ బ్రేక్‌లు కూడా ఇందులో అమర్చారు.