Loading...
Honda Avancier SUV: కొత్త హోండా అవాన్సియర్ ఎస్‌యూవీ ఎంట్రీ.. హైబ్రిడ్ టెక్నాలజీతో అదుర్స్!
కొత్త హోండా అవాన్సియర్ ఎస్‌యూవీ ఎంట్రీ.. హైబ్రిడ్ టెక్నాలజీతో అదుర్స్!

Honda Avancier SUV: కొత్త హోండా అవాన్సియర్ ఎస్‌యూవీ ఎంట్రీ.. హైబ్రిడ్ టెక్నాలజీతో అదుర్స్!

వ్రాసిన వారు Balachander Sharma
Nov 20, 2026
05:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా తన సరికొత్త అవాన్సియర్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. మూడు వరుసల సీట్లతో రూపొందించిన ఈ భారీ ఎస్‌యూవీలో నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ టెక్నాలజీ, డ్యూయల్‌పవర్ ఎలక్ట్రిక్ ఆల్‌వీల్ డ్రైవ్ (eAWD) వ్యవస్థను పరిచయం చేసింది. కొత్త ప్లాట్‌ఫామ్‌పై తయారైన ఈ కారు తొలుత థాయ్‌లాండ్, జపాన్, చైనా సహా ఆసియా మార్కెట్లలో అందుబాటులోకి రానుంది. భారత్‌లో విడుదలపై మాత్రం కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. హోండా కొత్తగా రూపొందించిన హెచ్‌ లోగోను పొందిన తొలి మోడల్ కూడా ఇదే కావడం విశేషం.

Details

ఆరు సీట్లు.. ప్రయాణానికి ప్రీమియం అనుభూతి

దూర ప్రయాణాల్లో సౌకర్యానికి ప్రాధాన్యం ఇచ్చేలా అవాన్సియర్‌ను రూపొందించారు. ప్రారంభంలో 2+2+2 విధానంలో ఆరు సీట్ల లేఅవుట్‌తో అందించే అవకాశం ఉంది.

ముఖ్యంగా రెండో వరుసలో ప్రయాణికులకు ఎక్కువ స్థలం, సౌకర్యం కల్పించారు.

బయటివైపు బాక్సీ డిజైన్, ఆకర్షణీయమైన ఎల్ఈడీ లైట్లు, ప్రత్యేకమైన గ్రిల్, 20 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఈ ఎస్‌యూవీకి కొత్త రూపాన్ని ఇస్తున్నాయి.

వెనుక భాగంలో నిలువుగా అమర్చిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

Details

12 స్పీకర్ల బోస్ సిస్టమ్.. లెవల్ 2 ADAS

క్యాబిన్‌లో ఐస్ గ్రే, బ్లాక్ రంగుల కలయికతో ప్రీమియం లుక్ తీసుకొచ్చారు.

పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి సౌకర్యాలున్నాయి.

మూడు వరుసలకూ ఏసీ వెంట్లు, వెంటిలేటెడ్, హీటెడ్ సీట్లు, మెమరీ ఫంక్షన్‌తో ఎలక్ట్రిక్ సీట్లు అందించారు.

12 స్పీకర్ల బోస్ ఆడియో సిస్టమ్, డాల్బీ అట్మాస్, లెవల్ 2 ADAS కూడా ఇందులో ఉన్నాయి.

ADVERTISEMENT

Details

2.0 లీటర్ హైబ్రిడ్ ఇంజిన్.. ప్రత్యేకమైన eAWD

అవాన్సియర్‌లో 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఈ-సీవీటీ ట్రాన్స్‌మిషన్‌తో జత చేశారు.

హోండా కొత్త హైబ్రిడ్ వ్యవస్థలో భాగంగా ముందు, వెనుక చక్రాలకు వేర్వేరుగా ఎలక్ట్రిక్ మోటార్లు శక్తిని అందిస్తాయి.

డ్రైవింగ్ పరిస్థితులకు అనుగుణంగా టార్క్‌ను పంపిణీ చేయడం ద్వారా వేగం, స్థిరత్వాన్ని మెరుగుపరచడం ఈ వ్యవస్థ లక్ష్యం.

అయితే ఇంజిన్ మొత్తం పవర్, టార్క్, బ్యాటరీ సామర్థ్యం, మైలేజీ వివరాలను హోండా ఇంకా వెల్లడించలేదు. భారత్‌లో ఈ ఎస్‌యూవీ ఎప్పుడు అడుగుపెడుతుందో చూడాలి.

ADVERTISEMENT