Page Loader
Honda Cars: తన పాపులర్‌ కార్లపై డిస్కౌంట్లు ప్రకటించిన హోండా 
తన పాపులర్‌ కార్లపై డిస్కౌంట్లు ప్రకటించిన హోండా

Honda Cars: తన పాపులర్‌ కార్లపై డిస్కౌంట్లు ప్రకటించిన హోండా 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2025
12:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్‌కు చెందిన ప్రఖ్యాత ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా, తమ ప్రజాదరణ పొందిన కార్ మోడళ్లపై ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది. కేవలం ధర తగ్గింపుతోనే కాదు,వినియోగదారుల విశ్వాసానికి గుర్తింపుగా లాయల్టీ బోనస్‌లు,ప్రత్యేక డీల్స్‌ను కూడా ఈ కంపెనీ అందిస్తోంది. ఈ నెలలో హోండా కారును కొనుగోలు చేసేవారు ఈ అన్ని ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న'సిటీ' మోడల్ పెట్రోల్ వేరియంట్‌పై హోండా రూ.1.07 లక్షల వరకు ఆఫర్లు ప్రకటించింది. ఈ మోడల్‌ ధర రూ.12.38 లక్షల నుంచి ప్రారంభమవుతోంది (ఎక్స్-షోరూమ్ ధర ప్రకారం). అలాగే,ఈ కారులో హైబ్రిడ్ వేరియంట్‌కు సంబంధించిన ప్రీమియం సెడాన్ ధర రూ.20.85 లక్షలు ఉండగా,దానిపై రూ.65వేల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.

వివరాలు 

ఎలివేట్ అపెక్స్ ఎడిషన్ పై కూడా డిస్కౌంట్

ఇంతేకాకుండా, హోండా అమేజ్ మూడవ తరం మోడల్‌పై కూడా కంపెనీ ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందిస్తోంది. ఇప్పటి వరకు హోండా కారును కలిగి ఉన్న కస్టమర్లకు లాయల్టీ బెనిఫిట్స్, అదనపు డీల్స్‌ అందిస్తున్నారు. ఈ మోడల్‌ ప్రస్తుత ఎక్స్‌-షోరూమ్ ప్రారంభ ధర రూ.8.09 లక్షలు. ఇంకా, హోండా ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన ఎలివేట్ అపెక్స్ ఎడిషన్ పై కూడా డిస్కౌంట్ ప్రకటించింది. ఈ వేరియంట్‌ ధర సాధారణంగా రూ.12.71 లక్షలు కాగా, ఆఫర్‌లో భాగంగా దీన్ని కేవలం రూ.12.39 లక్షలకు విక్రయిస్తున్నారు.