Honda CB300F Twister 2027: ఇథనాల్ ఇంజిన్‌తో హోండా CB300F ట్విస్టర్ 2027.. మార్కెట్లోకి ఎంట్రీ
ఈ వార్తాకథనం ఏంటి
హోండా తన కొత్త 2027 CB300F Twister మోటార్‌సైకిల్‌ను బ్రెజిల్ మార్కెట్లో పరిచయం చేసింది. భద్రత, రైడింగ్ డైనమిక్స్, ఇంధన సామర్థ్యంపై దృష్టి సారిస్తూ ఈ కొత్త మోడల్‌లో పలు కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా పెట్రోల్‌తో పాటు ఇథనాల్‌తో కూడా నడిచే FlexOne టెక్నాలజీ ఈ బైక్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 293.5cc సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కొనసాగించినప్పటికీ.. సస్పెన్షన్, భద్రతా ఫీచర్లు, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అంశాల్లో అప్‌డేట్స్ చేసింది. 2027 Honda CB300F Twisterలో FlexOne టెక్నాలజీ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ టెక్నాలజీతో బైక్‌ను పెట్రోల్, ఇథనాల్ లేదా ఈ రెండు ఇంధనాల మిశ్రమంతో నడపవచ్చు.
వివరాలు
బ్రెజిల్ మార్కెట్‌లో ఈ టెక్నాలజీ రైడర్లు..
ఇథనాల్ విస్తృతంగా అందుబాటులో ఉండే బ్రెజిల్ మార్కెట్‌లో ఈ టెక్నాలజీ రైడర్లకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుంది.
అవసరాన్ని బట్టి ఇంధనాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఈ బైక్‌లో 293.5cc సింగిల్ సిలిండర్, 4-వాల్వ్ OHC ఇంజిన్‌ను కొనసాగించారు.
ఎయిర్ కూలింగ్, ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో వచ్చే ఈ ఇంజిన్ పెట్రోల్‌తో 7,500 rpm వద్ద 24.5 CV పవర్, 5,000 rpm వద్ద 25.6 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇక ఇథనాల్‌తో నడిచినప్పుడు 7,500 rpm వద్ద 24.7 CV పవర్, 5,000 rpm వద్ద 26.2 Nm టార్క్‌ను అందిస్తుంది.
ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌ను జత చేశారు.
వివరాలు
అద్భుతమైన ఫీచర్లు..
రైడింగ్ డైనమిక్స్‌ను మెరుగుపరిచేందుకు సస్పెన్షన్ సెటప్‌లో కూడా మార్పులు చేశారు.
ముందు భాగంలో సాధారణ ఫోర్క్‌లకు బదులుగా 38mm Showa SFF-BP అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్‌ను అందించారు.
ఇవి సుమారు 130mm వీల్ ట్రావెల్‌ను అందిస్తాయి. వెనుక భాగంలో 120mm ట్రావెల్‌తో మోనోషాక్ సెటప్‌ను కొనసాగించారు.
భద్రత విషయంలోనూ హోండా పలు ఫీచర్లను అందించింది. ఇందులో Honda Selectable Torque Control (HSTC) ఉంది.
రైడింగ్ పరిస్థితులకు అనుగుణంగా వెనుక చక్రానికి అవసరమైన ట్రాక్షన్‌ను నిర్వహించడంలో ఇది సహాయపడుతుంది.
అలాగే Honda Ignition Security System (HISS) కూడా అందించారు.
బైక్‌ను అనధికారికంగా స్టార్ట్ చేయకుండా నిరోధించేందుకు ఈ సిస్టమ్ ఉపయోగపడుతుంది.
వివరాలు
బైక్ ఇండికేటర్లు ఆటెమేటిక్‌గా ఫ్లాష్..
కొత్త CB300F Twisterలో Emergency Stop Signal అనే మరో కీలక ఫీచర్‌ను కూడా అందించారు.
రైడర్ అకస్మాత్తుగా లేదా గట్టిగా బ్రేక్ వేసినప్పుడు వెనుక నుంచి వచ్చే వాహనాలను అప్రమత్తం చేసేందుకు బైక్ ఇండికేటర్లు ఆటోమేటిక్‌గా ఫ్లాష్ అవుతాయి.
ఫుల్ LED లైటింగ్‌ను కొనసాగించడంతో పాటు.. ముందు ఇండికేటర్లు పొజిషన్ లైట్లుగా కూడా పనిచేసేలా రూపొందించారు.
బైక్‌లో పూర్తి డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. రైడర్‌కు అవసరమైన సమాచారాన్ని ఈ డిజిటల్ డిస్‌ప్లే ద్వారా చూపిస్తుంది.
ఒంటరిగా ప్రయాణించే సమయంలో ఉపయోగించుకునేందుకు తొలగించగల రియర్ కౌల్‌ను కూడా అందించారు.
వివరాలు
అదిరిపోయే కలర్ ఆప్షన్లు..
2027 Honda CB300F Twisterను పలు కలర్ ఆప్షన్లలో అందిస్తున్నారు.
ఎరుపు, నలుపు రంగులతో పాటు నీలం ప్రధాన రంగుగా ఉండే మల్టీ-షేడ్ కలర్ కాంబినేషన్ కూడా అందుబాటులో ఉంది.
కొత్త సస్పెన్షన్, LED లైటింగ్, డిజిటల్ క్లస్టర్, HSTC వంటి ఫీచర్లతో ఈ మోటార్‌సైకిల్ మరింత ఆధునికంగా మారింది.
ప్రస్తుతం 2027 Honda CB300F Twisterను బ్రెజిల్ మార్కెట్ కోసం మాత్రమే పరిచయం చేశారు.
ఇథనాల్‌తో కూడా నడిచే FlexOne టెక్నాలజీ, 293.5cc ఇంజిన్, USD ఫ్రంట్ ఫోర్క్స్, HSTC, Emergency Stop Signal వంటి ఫీచర్లతో కొత్త CB300F Twister బ్రెజిల్ మార్కెట్లో ఆసక్తికరమైన ప్రీమియం మోటార్‌సైకిల్‌గా నిలిచే అవకాశం ఉంది.