Page Loader
భారతదేశంలో మార్చిలో విడుదల కానున్న హోండా సిటీ (ఫేస్‌లిఫ్ట్)
2023 హోండా సిటీ పెట్రోల్ ఇంజిన్‌ తోనే వస్తుంది

భారతదేశంలో మార్చిలో విడుదల కానున్న హోండా సిటీ (ఫేస్‌లిఫ్ట్)

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 24, 2023
06:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపనీస్ వాహన తయారీ సంస్థ హోండా సెడాన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్చి 2023 నాటికి భారతదేశంలో విడుదల చేయనుంది.సరికొత్త సాంకేతిక-ఆధారిత ఫీచర్లతో కొన్ని మార్పులతో అందుబాటులోకి వస్తుంది. డీజిల్ ఇంజిన్ నిలిపివేసి పెట్రోల్, పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ల ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఐదవ తరం హోండా సిటీ 2020లో భారతదేశంలో ప్రారంభించిన తర్వాత విడుదల కాబోతున్న మొదటి అప్డేట్ ఇదే. కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లను పక్కన పెడితే, అవుట్‌గోయింగ్ మోడల్‌కు విరుద్ధంగా పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రైన్ వివిధ ఆప్షన్స్ లో వస్తుంది. హోండా సిటీ (ఫేస్‌లిఫ్ట్) 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో నడుస్తుంది.

కార్

ధర, ఇతర వివరాలు లాంచ్ ఈవెంట్ లో వెల్లడించనున్న హోండా సంస్థ

మార్కెట్లో సెడాన్ హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియా, వోక్స్‌వ్యాగన్ వర్టస్, మారుతి సుజుకి సియాజ్ వంటి వాటితో పోటీ పడుతుంది. కొత్త హోండా సిటీలో వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ సీట్లు, ఆటో క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్‌తో ఐదు సీట్ల క్యాబిన్ ఉంటుంది. ప్రయాణీకుల భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, క్రాష్ సెన్సార్లు, వెనుక కెమెరావంటి సదుపాయాలు ఉన్నాయి. హోండా లాంచ్ ఈవెంట్ లో భారతదేశంలో 2023 హోండా సిటీ (ఫేస్‌లిఫ్ట్) ధర, ఇతర సమాచారాన్ని వెల్లడిస్తుంది. ప్రస్తుత మోడల్ ధర రూ. 11.87 లక్షలు (ఎక్స్-షోరూమ్) కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది.