భారతదేశంలో విడుదలైన హ్యుందాయ్ 2023 AURA సెడాన్
దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ సంస్థ 2023 AURA సెడాన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఇది E, S, SX, SX(O) వేరియంట్లలో లభిస్తుంది. విశాలమైన టెక్-లోడెడ్ క్యాబిన్ తో పాటు స్టైలిష్ డిజైన్ తో వస్తుంది. ఇది పెట్రోల్, CNG రెండిటిలో 1.2-లీటర్ ఇంజన్ తో నడుస్తుంది. ఇది ఆరు రంగుల్లో అందుబాటులో ఉంది. హ్యుందాయ్ AURA 2023 వెర్షన్ మరిన్ని సాంకేతిక, భద్రతా ఫీచర్లతో వస్తుంది. అయితే, మిగిలిన అంశాలలో మాత్రం ముందు మోడల్స్ లాగానే ఉంటుంది. మార్కెట్లో హోండా అమేజ్, టాటా టిగోర్, మారుతి సుజుకి డిజైర్ కు పోటీగా ఉంటుంది.
భారతదేశంలో 2023 హ్యుందాయ్ AURA ప్రారంభ ధర రూ. 6.3 లక్షలు
దీని లోపల లెదర్‌తో చుట్టిన స్టీరింగ్ వీల్, ఫుట్‌వెల్ ప్రాంతానికి లైటింగ్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌తో ఉన్న క్యాబిన్ ఉంది. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకి సపోర్ట్ చేస్తుంది. ప్రయాణీకుల భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBD, ESC, హిల్-హోల్డ్ అసిస్ట్ ఉన్నాయి. భారతదేశంలో, 2023 హ్యుందాయ్ AURA బేస్ పెట్రోల్ E మోడల్ ప్రారంభ ధర రూ. 6.3 లక్షలు టాపింగ్ CNG SX వేరియంట్ ధర రూ. 8.87 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). బుకింగ్‌లు ఇప్పటికే తెరుచుకున్నాయి.