LOADING...
భారతదేశంలో విడుదలైన  2023 హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS
2023 హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS ధర రూ. 5.68 లక్షలు

భారతదేశంలో విడుదలైన 2023 హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 20, 2023
03:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

హ్యుందాయ్ భారతదేశంలో గ్రాండ్ i10 NIOS 2023 అప్డేట్ ను లాంచ్ చేసింది. 2019లో ప్రవేశపెట్టిన హ్యుందాయ్‌ గ్రాండ్ i10 NIOS భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా మారింది. రీడిజైన్ చేసిన ఫ్రంట్ ఫాసియా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లతో, ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ కొనుగోలుదారులను ఆకర్షిస్తుంది. 2023 హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS బ్రాండ్ 'సెన్సుయస్ స్పోర్టినెస్' డిజైన్ లాంగ్వేజ్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీనికి ఇండికేటర్-మౌంటెడ్ ORVMలు, రూఫ్ రెయిల్‌లు, క్రోమ్డ్ డోర్ హ్యాండిల్స్, 15-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ ఇరు వైపులా ఉన్నాయి. కనెక్ట్ చేసిన LED టెయిల్‌లైట్‌లు వెనుక భాగంలో ఉన్నాయి.ఇది 1.2-లీటర్ ఇంజన్‌తో నడుస్తుంది.

కార్

ప్రయాణీకుల భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు

లోపలి భాగంలో, డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌తో తో పాటు విశాలమైన ఐదు-సీట్ల క్యాబిన్‌ ఉంది. సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో కనెక్టవిటీ ఉన్న 8.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కన్సోల్‌ ఉంది. ప్రయాణీకుల భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. భారతదేశంలో, 2023 హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS ప్రారంభ ధర రూ. 5.68 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఈ కారును ఆన్‌లైన్‌లో లేదా బ్రాండ్ డీలర్‌షిప్‌ల ద్వారా రూ. 11,000 టోకెన్‌ సొమ్ము చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

Advertisement