Page Loader
హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS v/s మారుతి-సుజుకి స్విఫ్ట్ ఏది మంచిది
రెండింటిలో కీలెస్ ఎంట్రీ, వెనుక కెమెరాను ఉన్నాయి

హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS v/s మారుతి-సుజుకి స్విఫ్ట్ ఏది మంచిది

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 12, 2023
03:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

హ్యుందాయ్ తన ఎంట్రీ-లెవల్ వాహనం గ్రాండ్ i10 NIOS 2023 వెర్షన్ లాంచ్ చేసింది. ప్రస్తుతం బుకింగ్స్ తెరిచారు. అప్‌డేట్ చేసిన ఈ మోడల్ మారుతి సుజుకి స్విఫ్ట్‌కి పోటీగా ఉంటుంది. హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS రీడిజైన్ చేసిన ఫ్రంట్ ఫాసియాతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఇందులో మస్కులర్ హుడ్, రీడిజైన్ చేయబడిన బ్లాక్-అవుట్ గ్రిల్, ప్రొజెక్టర్ హెడ్‌లైట్‌లు, బ్లాక్-కలర్ రూఫ్ రైల్స్, షార్క్-ఫిన్ యాంటెన్నాఉన్నాయి. మారుతి సుజుకి స్విఫ్ట్‌లో డిజైన్ చేసిన బానెట్, బ్లాక్-అవుట్ హనీకోంబ్-మెష్ గ్రిల్, రూఫ్-మౌంటెడ్ యాంటెన్నా ఉన్నాయి. రెండు కార్లలో 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌ ఉన్నాయి. రెండింటిలో కీలెస్ ఎంట్రీ, వెనుక కెమెరాను ఉన్నాయి

కార్

హ్యుందాయ్ గ్రాండ్ మారుతీ సుజుకి కన్నా తక్కువ ధరకే మెరుగైన టెక్నాలజీని అందిస్తుంది

2023 హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS ప్రీమియంలో కీలెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, వాయిస్ కంట్రోల్‌తో 8.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ,ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి సౌకర్యాలు ఉన్నాయి. మారుతి సుజుకి స్విఫ్ట్‌లో ఆల్-బ్లాక్ క్యాబిన్, కీలెస్ ఎంట్రీ, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. భారతదేశంలో, మారుతి సుజుకి స్విఫ్ట్ ధర రూ. 5.92 లక్షలు నుండి రూ. 8.85 లక్షలు, హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS ప్రీమియం ధర రూ. 5.54 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)ఉండచ్చని అంచనా వేస్తున్నారు. అయితే మెరుగైన టెక్నాలజీ, ఉన్నతమైన భద్రతా ప్రమాణాలు అందించడం వలన హ్యుందాయ్ గ్రాండ్ i10 NIOS సరైన ఎంపిక.