Hyundai మోటార్ ఇండియాకు కొత్త COOగా తరుణ్ గార్గ్
ఈ వార్తాకథనం ఏంటి
హ్యుందాయ్ మోటార్ ఇండియా సోమవారం తన సీనియర్ మేనేజ్‌మెంట్ లీడర్‌షిప్‌లో జరిగిన మార్పును ప్రకటించింది. ఇది జనవరి 1, 2023 నుండి అమలులోకి వచ్చింది.
సేల్స్, మార్కెటింగ్ & సర్వీస్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ ను కంపెనీ సేల్స్, మార్కెటింగ్, సర్వీస్ & ప్రోడక్ట్ స్ట్రాటజీని పర్యవేక్షించే చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)గా పదోన్నతి పొందారు.
గార్గ్ డిసెంబర్ 2019 నుండి ఈ హ్యుందాయ్ మోటార్ ఇండియాలో పని చేస్తున్నారు. దానికి ముందు, ఆయనకు మారుతి సుజుకి సంస్థలో 1994 నుండి అంటే దాదాపు 25 సంవత్సరాలకు పైగా పనిచేసిన అనుభవం ఉంది.
హ్యుందాయ్
HMIL బోర్డులో డైరెక్టర్లుగా కొనసాగనున్న గార్గ్, కృష్ణన్
గోపాల కృష్ణన్ CS, వైస్ ప్రెసిడెంట్ (ప్రొడక్షన్), ప్రొడక్షన్, క్వాలిటీ మేనేజ్‌మెంట్ & సప్లై చైన్‌ను పర్యవేక్షించే చీఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫీసర్ (CMO)గా పదోన్నతి పొందారు. గార్గ్, కృష్ణన్ HMIL బోర్డులో డైరెక్టర్లుగా కొనసాగుతారు
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఎండి, సిఈఓ ఉన్సూ కిమ్ మాట్లాడుతూ, "హ్యుందాయ్ మోటార్ ఇండియా నాయకత్వానికి ఈ పదోన్నతులతో తగిన గుర్తింపు, గౌరవం లభించింది అని మేము అనుకుంటున్నాం. మా ప్రధాన విలువలు పని సంస్కృతిని మెరుగ్గా చేసి సంస్థను ఉన్నతంగా నిలుపుతాయి. మా కస్టమర్‌లు, భాగస్వాములు, ఉద్యోగుల కోసం అనుకూలమైన వాతావరణం నిర్మించడంలో నిరంతరాయంగా పనిచేస్తాం" అని అన్నారు.