Page Loader
మారుతీ సుజుకి సంస్థ నుండి వస్తున్న NEXA సిరీస్ లో మరో SUV
ఈ కారు కొత్త తరం బాలెనో ఆధారంగా రూపొందించబడింది.

మారుతీ సుజుకి సంస్థ నుండి వస్తున్న NEXA సిరీస్ లో మరో SUV

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 12, 2023
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

మారుతి సుజుకి ఆటో ఎక్స్‌పో 2023లో సరికొత్త కూపే SUV ఫ్రాంక్స్‌ను విడుదల చేసింది. ఇందులో బాలెనో RS మోడల్‌లో చివరిగా కనిపించిన అత్యంత ప్రశంసలు పొందిన 1.0-లీటర్ బూస్టర్ జెట్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ ఉంది. ఇది సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా, ఆల్ఫా రకాల్లో అందుబాటులో ఉంది. కొనసాగుతున్న ట్రెండ్ నుండి ప్రయోజనం పొందడానికి, మారుతి సుజుకి తన NEXA సిరీస్ లో కూపే-స్టైల్ SUVఫ్రాంక్స్‌ని పరిచయం చేసింది. ఇందులో SUV సిల్హౌట్‌, మస్కులర్ క్లామ్‌షెల్ బానెట్, బంపర్-మౌంటెడ్ ట్రై-బీమ్ LED హెడ్‌లైట్‌లు, ORVMలు, రూఫ్ రెయిల్‌లు, బ్లాక్ క్లాడింగ్‌తో వీల్ ఆర్చ్‌లు, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్, వెనుక భాగంలో షార్క్-ఫిన్ యాంటెన్నా అందుబాటులో ఉన్నాయి.

మారుతీ

యువ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడిన కూపే SUV ఫ్రాంక్స్‌

మారుతి సుజుకి ఫ్రాంక్స్ 1.2-లీటర్ "డ్యూయల్‌జెట్" పెట్రోల్ ఇంజన్‌తో లేదా 1.0-లీటర్ బూస్టర్ జెట్ టర్బో-పెట్రోల్ యూనిట్‌తో నడుస్తుంది. లోపల డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్, వైర్‌లెస్ ఛార్జర్, హెడ్-అప్ డిస్‌ప్లే, యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌ ఉన్న విశాలమైన ఐదు-సీట్ల క్యాబిన్‌ ఉంటుంది. ప్రయాణీకుల భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ-వ్యూ కెమెరా ఉంది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ధరకు సంబంధించిన వివరాలను వాహన తయారీ సంస్థ రాబోయే వారాల్లో వెల్లడిస్తుంది. ప్రస్తుతం రూ. 11,000 టోకెన్‌ సొమ్ముతో ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ఇది NEXA డీలర్‌షిప్‌ల ద్వారా అందుబాటులో ఉంటుంది. ఇది కొత్త తరం బాలెనో ఆధారంగా, ప్రధానంగా యువ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది.