Best sedan car : హోండా సిటీ కొత్త ఎడిషన్.. ప్రీమియం ఫీచర్స్, ధర ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
హోండా సిటీ, సెడాన్ సెగ్మెంట్లో దుమ్ముదులిపే ఓ మోడల్, తాజాగా ప్రీమియం టచ్‌తో కొత్త 'హోండా సిటీ అపెక్స్' ఎడిషన్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.
ఈ ఎడిషన్‌లో ప్రత్యేక యాక్ససరీ ప్యాకేజీతో మరిన్ని అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి.
హోండా సిటీ అపెక్స్ ఎడిషన్ విశేషాలు
ఈ కొత్త ఎడిషన్ ధర రూ.13.30 లక్షల నుంచి రూ.15.62 లక్షల మధ్య (ఎక్స్‌షోరూమ్) ఉంది. ఇదొక లిమిటెడ్ ఎడిషన్ మోడల్ కావడం విశేషం.
అందులో ప్రత్యేక 'అపెక్స్ ఎడిషన్' బ్యాడ్జింగ్, ఫ్రంట్ ఫెండర్స్, బూట్ లిడ్‌పై సింబల్ వంటి ప్రత్యేకతలున్నాయి.
ఇందులో యాంబియంట్ లైటింగ్ సహా ప్రత్యేకమైన లెథరెట్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, డోర్ ప్యాడింగ్, కుషన్లు, సీట్ కవర్లు వంటి అదనపు ఫీచర్లను అందిస్తోంది
Details
స్పెసిఫికేషన్లు, ఇంజిన్
హోండా సిటీ అపెక్స్ ఎడిషన్‌లో 1.5 లీటర్ ఐ-వీటీఈసీ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది, ఇది 119 బీహెచ్‌పీ శక్తిని, 145 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ మోడల్ 6-స్పీడ్ మాన్యువల్, 7-స్టెప్ సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంటుంది. మైలేజ్ పరంగా, మాన్యువల్ వర్షన్ 17.8 km/l, ఆటోమేటిక్ వర్షన్ 18.4 km/l అందిస్తుంది.
అదనపు ఫీచర్లు
ఈ సెడాన్‌లో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), ఆరు ఎయిర్‌బ్యాగులు, లేన్ వాచ్ కెమెరా, యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి.
506 లీటర్ల బూట్ కెపాసిటీతో కూడిన ఈ మోడల్, ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందిస్తుంది.
Details
విజయవంతమైన బ్రాండ్ గా గుర్తింపు
హోండా సిటీ భారతదేశంలో ఒక విజయవంతమైన బ్రాండ్‌గా నిలిచిందని హోండా కార్స్ ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహ్ల్ చెప్పారు.
ఈ కొత్త 'అపెక్స్ ఎడిషన్' ద్వారా, తాము వినియోగదారులకు ప్రీమియం అనుభూతిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
దీంతో హోండా కుటుంబంలో కొత్త కస్టమర్లను ఆహ్వానించడంపై తాము దృష్టి సారించామన్నారు.