Page Loader
City Sport Edition: హోండా సిటీలో 'స్పోర్ట్‌' ఎడిషన్‌ వచ్చేసింది.. ఫీచర్లు ఇవే! 
హోండా సిటీలో 'స్పోర్ట్‌' ఎడిషన్‌ వచ్చేసింది.. ఫీచర్లు ఇవే!

City Sport Edition: హోండా సిటీలో 'స్పోర్ట్‌' ఎడిషన్‌ వచ్చేసింది.. ఫీచర్లు ఇవే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 21, 2025
02:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్‌లలో ఒకటైన హోండా సిటీ ఇప్పుడు సరికొత్త ఎడిషన్‌తో మార్కెట్లోకి వచ్చేసింది. 'హోండా సిటీ స్పోర్ట్' పేరుతో ఈ నూతన మోడల్ రూ. 14.89 లక్షల (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఎక్స్‌టీరియర్‌, ఇంటీరియర్‌ అంతా బ్లాక్-ఔట్‌ అంశాలతో ప్రత్యేకతను సంతరించుకున్న ఈ మోడల్‌, పరిమిత సంఖ్యలో మాత్రమే లభించడం విశేషం. ఈ విభాగంలో ఫోక్స్‌వ్యాగన్ విర్టస్, స్కోడా స్లావియా, హ్యుందాయ్ వెర్నాలాంటి మోడళ్లకే గట్టి పోటీని అందించనుంది.

Details

హోండా సిటీ స్పోర్ట్ ఎడిషన్: కొత్తగా ఏముందంటే? 

సెడాన్‌ ఎక్స్‌టీరియర్‌ విభాగంలో క్రోమ్‌ గ్రిల్‌, రేర్‌ స్పాయిలర్‌కి బ్లాక్‌ ఫినిష్‌ అందించారు. ORVMలు (ఆవుట్‌సైడ్‌ రియర్‌ వ్యూ మిర్రర్స్‌) క్రిస్టల్‌ బ్లాక్‌ ఫినిష్‌తో రాకగా, మల్టీ-స్పోక్‌ అలాయ్‌ వీల్స్‌ మెటాలిక్‌ గ్రేలో డిజైన్‌ చేశారు. షార్క్‌ ఫిన్‌ యాంటెన్నా గ్లోస్‌-బ్లాక్‌ టచ్‌తో కనువిందు చేస్తుంది. డిక్కీపై 'స్పోర్ట్‌' లోగో కూడా ప్రత్యేకతనిస్తుంది. క్యాబిన్‌ కూడా పూర్తి బ్లాక్‌ ఇంటీరియర్‌తో రానుంది. డాష్‌బోర్డుపై ఎరుపురంగు గార్నిష్‌, సీట్లపై నల్ల లెథరెట్‌, ఎరుపురంగులో కాంట్రాస్ట్‌ స్టిచింగ్‌, సాఫ్ట్-టచ్‌ డోర్‌ ఇన్‌సర్ట్స్‌, నల్ల ఎయిర్‌ వెంట్స్‌, ఎరుపురంగు స్టిచింగ్‌తో స్టీరింగ్‌ వీల్‌ - ఇవన్నీ ప్రీమియం ఫీల్‌ను ఇస్తాయి.

Details

హోండా సిటీ స్పోర్ట్ ఎడిషన్: స్పెసిఫికేషన్లు 

1.5-లీటర్‌ నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ శక్తినిచ్చే ఈ మోడల్‌ 119 బీహెచ్‌పీ పవర్‌, 145 ఎన్‌ఎమ్‌ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్‌ సీవీటీ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌తో రానున్న ఈ మోడల్‌ 18.40 kmpl ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఫీచర్ల పరంగా.. 8-అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ (యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటో), వాయిస్‌ కమాండ్‌, ఫోర్‌ స్పీకర్‌ సౌండ్‌ సిస్టమ్‌, ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, ఎంఐడీ యూనిట్‌తో డ్యూయల్‌-పాడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్‌, లెవల్‌ 2 ADAS‌ తదితర ఫీచర్లతో రానుంది.

Details

హోండా సిటీ స్పోర్ట్: రంగులు - లభ్యత 

ఈ మోడల్‌ ప్లాటినం వైట్‌ పర్ల్, రేడియంట్‌ రెడ్‌ మెటాలిక్‌, మెటియోరాయిడ్‌ గ్రే మెటాలిక్‌ రంగుల్లో అందుబాటులో ఉంది. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హోండా డీలర్‌షిప్‌లలో ఈ స్పెషల్‌ ఎడిషన్‌ విక్రయానికి సిద్ధంగా ఉంది.