
Honda Elevate 2025: కొత్త కలర్ ఆప్షన్లు, ప్రీమియమ్ ఇంటీరియర్‌తో మరింత స్టైలిష్‌గా వచ్చేసిన హోండా ఎలేవేట్ 2025!
ఈ వార్తాకథనం ఏంటి
హోండా కార్స్ ఇండియా (Honda Cars India) తన ప్రీమియమ్ SUV ఎలివేట్ (Elevate) కి తాజా అప్‌డేట్స్‌ను ప్రకటించింది. రాబోయే పండుగ సీజన్ ముందు ఈ మార్పులను ప్రవేశపెట్టడం ద్వారా కస్టమర్లను మరింతగా ఆకర్షించడం కంపెనీ ప్రధాన ఉద్దేశం. ఈ సరికొత్త అప్‌డేట్‌లో కొత్త ఇంటీరియర్ థీమ్‌లు, సీటు అప్‌డేట్‌లు, అదనపు ఫీచర్లు చేరాయి.
వివరాలు
కొత్త 'క్రిస్టల్ బ్లాక్ పెర్ల్' కలర్ ఆప్షన్
ముందు భాగంలో హోండా 'ఆల్ఫా-బోల్డ్ ప్లస్ గ్రిల్'ను పరిచయం చేసింది. 9 స్లాట్‌లతో కూడిన ఈ వెర్టికల్ డిజైన్‌కు మందపాటి క్రోమ్ బోర్డర్ తోడవడంతో కారు మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఈ గ్రిల్ అన్ని వేరియంట్లలో యాక్సెసరీగా లభిస్తుండగా, ప్రత్యేకంగా 'సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్' లో మాత్రం స్టాండర్డ్‌గా వస్తుంది. అదనంగా కొత్త 'క్రిస్టల్ బ్లాక్ పెర్ల్' కలర్ ఆప్షన్‌ను కూడా అందించారు. ఇది బేస్ SV పెట్రోల్-మాన్యువల్‌ను మినహాయించి మిగతా అన్ని వేరియంట్లలో లభిస్తుంది. ఈ కొత్త రంగు ధరను కూడా రూ. 8,000 అదనంగా నిర్ణయించారు. ఇదే ధర ప్లాటినం వైట్ పెర్ల్, ఆబ్సిడియన్ బ్లూ పెర్ల్‌లకు కూడా వర్తిస్తుంది.
వివరాలు
మూడు రంగులలో ఎలివేట్ కేబిన్
ఇంటీరియర్‌లో కూడా ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. టాప్-ఎండ్ ZX వేరియంట్లో కొత్త 'ఐవరీ థీమ్'ను ప్రవేశపెట్టారు. ఇందులో వైట్ లెదరెట్ సీట్లు, సాఫ్ట్-టచ్ డోర్ లైనర్లు, డాష్‌బోర్డ్ మెటీరియల్స్ ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఎలివేట్ కేబిన్ మూడు రంగులలో.. టాన్, బ్లాక్, ఐవరీ..లభిస్తోంది. అదే సమయంలో ZX మోడల్‌లో 360 డిగ్రీ కెమెరా, 7-కలర్ ఆంబియంట్ లైటింగ్ మాత్రం ఆప్షనల్ గానే కొనసాగుతున్నాయి. ఇక మధ్యస్థాయి V, VX వేరియంట్స్ లో ఉన్న షాడో బేజ్ ఫాబ్రిక్ సీట్లను తొలగించి, వాటి స్థానంలో బ్లాక్ ఫాబ్రిక్ సీట్లు, వైట్ సాఫ్ట్-టచ్ డాష్‌బోర్డ్, డోర్ లైనర్లు అందించారు. ఇక సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్లో మాత్రం 7-కలర్ ఆంబియంట్ లైటింగ్‌ను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు.
వివరాలు
ఎలివేట్ SUV ప్రారంభ ధర రూ.11.91 లక్షల ఎక్స్‌షోరూమ్
గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ మోడల్‌లో మెకానికల్ మార్పులు లేవు. 2025 ఎలివేట్ ఇప్పటికీ అదే 1.5 లీటర్, 4-సిలిండర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్తో వస్తోంది. ఇది 121 హెచ్‌పి పవర్, 145 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6-స్పీడ్ మాన్యువల్, CVT ఆటోమేటిక్ లభిస్తున్నాయి. ధర విషయానికి వస్తే, ఎలివేట్ SUV ప్రారంభ ధర ఇప్పటికీ రూ. 11.91 లక్షల ఎక్స్‌షోరూమ్ వద్దే ఉంది. మొత్తం మీద, కొత్త రంగులు, ఇంటీరియర్ థీమ్‌లు, అదనపు ఫీచర్లతో ఈ ప్రీమియమ్ SUV ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మారి, పండుగ సీజన్‌లో కొనుగోలు దారులకు ప్రత్యేకమైన ఎంపికగా నిలుస్తోంది.