Page Loader
హోండా ఎలివేట్‌ Vs కియా సెల్టోస్.. రెండింట్లో బెస్ట్ ఆప్షన్ ఇదే!
ఈ రెండు SUVలు ఆల్-LED లైటింగ్ సెటప్‌ను కలిగి ఉంటాయి

హోండా ఎలివేట్‌ Vs కియా సెల్టోస్.. రెండింట్లో బెస్ట్ ఆప్షన్ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2023
04:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్ కార్ల తయారీ సంస్థ హోండా మంగళవారం మిడ్ సైజ్ ఎస్‌యూవీ హోండా ఎలివెట్ ని భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. త్వరలో ప్రారంభమయ్యే పండుగల సీజన్‌లో ఎలివేట్ మోడల్ కారు ఆవిష్కరణకు హోండా కార్స్ రంగం సిద్ధం చేస్తోంది. అదే విధంగా కియా మోటార్ ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. 2019 ఆగస్టులో మార్కెట్లోకి ఎంటరైన కియా సెల్టోస్ సేల్స్ లో ఐదు లక్షల మైలురాయిని దాటి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ రెండు కార్లలో ఏది బెస్ట్ అప్షనో తెలుసుకుందాం. హోండా ఎలివేట్లో ఫ్లాట్ బానెట్, పెద్దబ్లాక్-అవుట్ గ్రిల్, LED హెడ్‌లైట్లు, డోర్-మౌంటెడ్ ORVMలు, 16-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా, ర్యాప్అరౌండ్ టెయిల్‌ల్యాంప్‌లను కలిగి ఉంది.

Details

కియా సెల్టోస్ లో ప్రత్యేక ఫీచర్లు

కియా సెల్టోస్‌లో మస్కులర్ బానెట్, బ్లాక్-అవుట్ హనీకోంబ్-మెష్ గ్రిల్, రూఫ్ రెయిల్‌లు, ORVMలు, 18-అంగుళాల డిజైనర్ అల్లాయ్ వీల్స్, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్, ర్యాప్-అరౌండ్ LED టెయిల్‌లైట్లు ఉన్నాయి. హోండా ఎలివేట్ సింగిల్-పేన్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్, బహుళ ఎయిర్‌బ్యాగ్‌లు, ఐదు-సీట్ల క్యాబిన్‌ను కలిగి ఉంది. కియా సెల్టోస్ ప్రీమియం సాఫ్ట్-టచ్ డాష్‌బోర్డ్, లెథెరెట్ అప్హోల్స్టరీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఫైవ్-సీటర్ క్యాబిన్‌ను పొందుతుంది. భారతదేశంలో, కియా సెల్టోస్ రూ. 10.89 లక్షలు నుండి రూ. 19.65 లక్షల మధ్యలో ఉంది. అయితే హోండా ఎలివేట్ ప్రారంభ ధర దాదాపు రూ. 10 లక్షలు ఉండనుంది.