Honda Goldwing: భారత మార్కెట్లోకి వచ్చేస్తోన్న హోండా గోల్డ్ వింగ్.. ఫీచర్స్ కేక అంతే
భారత మార్కెట్లో సూపర్ బైక్స్ కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. రోడ్డు మీద సూపర్ బైక్స్ లో వెళుతుంటే అందరి చూపు ఆ బైకు పైనే ఉంటుంది. తాజాగా జపనీస్ వాహన తయారీ సంస్థ హోండా గ్లోబల్ మార్కెట్ల కోసం 2024 గోల్డ్ విండ్ గురించి సరికొత్త అప్డేట్ ఇచ్చింది. కొత్త గోల్డ్‌వింగ్ అంతర్జాతీయంగా పరిచయం చేయనప్పటికీ, భారతదేశంలో ఈ బైకును ప్రారంభించాలని ఆ సంస్థ యోచిస్తోంది. ఈ బైకు నాలుగు రైడింగ్ మోడ్‌లలో ఉండనుంది. టూర్, స్పోర్ట్, ఎకో, రెయిన్ రూపంలో ఉండనుంది. హోండా గోల్డ్ వింగ్ టూరు చూడటానికి చాలా స్టైలిష్ ఉంటుంది.
హోండా గోల్డ్ వింగ్ లో అదనపు ఫీచర్లు
హోండా గోల్డ్ వింగ్ లో LED లైటింగ్, బ్లూటూత్ కనెక్టివిటీని కలిగి ఉంటాయి. స్టాండర్డ్ గోల్డ్‌వింగ్ ప్రస్తుతం మాట్టే ఆర్మర్డ్ గ్రీన్ మెటాలిక్ రంగును కలిగి ఉంది. 2024 హోండా గోల్డ్‌వింగ్ 1,833cc, ఫ్లాట్ సిక్స్-సిలిండర్, 24-వాల్వ్ ఇంజన్‌తో 125hp శక్తిని, 170Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ అందించారు. అదనపు భద్రత కోసం, మోటార్‌సైకిల్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), రెండు టైప్-సి పోర్ట్‌లు, స్పీకర్లు, ఎయిర్‌బ్యాగ్ వంటి ఫీచర్స్‌తో రానుంది.