Page Loader
హైదరాబాద్‌లో హోండా ఎలివేట్ ఆన్ రోడ్ ధర వివరాలివే! 
హైదరాబాద్‌లో హోండా ఎలివేట్ ఆన్ రోడ్ ధర వివరాలివే!

హైదరాబాద్‌లో హోండా ఎలివేట్ ఆన్ రోడ్ ధర వివరాలివే! 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 05, 2023
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎలక్ట్రిక్​ వాహనాలకు మంచి డిమాండ్​ ఉండడంతో అనేక ఆటోమొబైల్​ సంస్థలు పోటీతత్వంతో ఈవీలను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇండియాలో హొండా సంస్థ నుంచి వచ్చిన తొలి ఎస్​యూవీగా హోండా ఎలివేట్​ నిలిచింది. ఈ సందర్భంలో ఎస్​యూవీ మోడల్​లోని వేరియంట్లు, హైదరాబాద్​లో వాటి ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హోండా ఎలివేట్​ ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు..హోండా ఎలివేట్​లో ఎస్​వీ,వీ,వీఎక్స్​,జెడ్​ఎక్స్ అని మొత్తం నాలుగు వేరియంట్లు ఉన్నాయి. హైదరాబాద్​లో వీటి ఆన్​రోడ్​ ప్రైజ్​ వివరాలు ఇలా ఉన్నాయి.. వీ సీవీటీ-రూ. 16.31లక్షలు, వీఎక్స్​ ఎంటీ-రూ. 16.67లక్షలు,వీఎక్స్​ సీవీటీ-రూ. 18లక్షలు,జెడ్​ఎక్స్​ ఎంటీ-రూ. 18.37లక్షలు, జెడ్​ఎక్స్​ సీవీటీ-రూ. 19.75లక్షలు, జెడ్​ఎక్స్​ సీవీటీ డ్యూయెల్​ టోన్​- రూ. 19.99లక్షలు.

Details 

హోండా ఎలివేట్ ఎస్​యూవీ ఫీచర్స్​ ఇవే

హోండా కొత్త ఎస్​యూవీ కేబిన్​లో డ్యూయెల్​ టోన్​ థీమ్​,ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​,10.25 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​,వయర్​లెస్​ ఛార్జర్​,క్రూజ్​ కంట్రోల్​,ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​,6 ఎయిర్​బ్యాగ్స్​,హోండా సెన్సింగ్​ ఏడీఏఓఎస్​ సూట్​ అలాగే అన్ని అధునాతన ఫీచర్స్​ ఇందులో లభిస్తున్నాయి. మార్కెట్​ అంచనాల ప్రకారం ఈ హోండా ఎలివేట్​ ఎస్​యూవీ.. మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా, హ్యుందాయ్​ క్రేటా వంటి మోడల్స్​కు గట్టి పోటీనిస్తోందని సమాచారం. హోండా కార్స్ ఇండియా తన ఆల్-న్యూ ఎలివేట్ మిడ్-సైజ్ SUVఆల్-ఎలక్ట్రిక్ వెర్షన్‌ను 2026 నాటికి తీసుకురావాలని ఆలోచన చేస్తోంది. 2026లో లాంచ్​ అయ్యే హోండా ఎలివేట్​ ఈవీ.. సంస్థ నుంచి వచ్చే తొలి ఎలక్ట్రిక్​ మోడల్​గా నిలిచే అవకాశం ఉంది.