Page Loader
ఇండియన్ మార్కెట్లోకి హోండా కొత్త ఎస్​యూవీ.. ఎలివేట్ మోడల్​ ధర ఎంతో తెలుసా
ఇండియన్ మార్కెట్లోకి హోండా కొత్త ఎస్​యూవీ

ఇండియన్ మార్కెట్లోకి హోండా కొత్త ఎస్​యూవీ.. ఎలివేట్ మోడల్​ ధర ఎంతో తెలుసా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 04, 2023
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో హోండా ఎలివేట్​ కొత్తగా లాంచ్​ అయ్యింది. ఇండియన్​ ఆటోమొబైల్​ మార్కెట్​లో హోండా ఎలివేట్​ ఎస్​యూవీ(SUV)ని కంపెనీ లాంచ్​ చేసింది. ఈ మేరకు కారు డెలివరీలు ప్రారంభమైయ్యాయని వెల్లడించింది. మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను తెలుసుకుందాం. కొత్త ఎస్​యూవీ ఫీచర్స్​ తెలుసుకోండి : హోండ్​ ఎలివేట్​ ఎస్​యూవీ డిజైన్ ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. స్వెప్ట్​బ్యాక్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాంప్స్​, భారీ గ్రిల్​, ఫాగ్​ లైట్స్​ కోసం ట్రైయాంగ్యులర్​ హోజింగ్​, 16 ఇంచ్​ డ్యూయెల్​ టోన్​ అలాయ్​ వీల్స్​ను పొందుపర్చారు. రూఫ్​ రెయిల్స్​, 10.25 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, వయర్​లెస్​ ఛార్జర్​, క్రూజ్​ కంట్రోల్​, ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, 6 ఎయిర్​బ్యాగ్స్​ వంటివి ఉన్నాయి.

DETAILS

హోండా​కు SUV మోడల్ లో వచ్చిన తొలి సెగ్మెంట్​ కారు హోండా ఎలివేట్

హోండా ఎలివేట్​లో 1.5 లీటర్​ ఐ-వీటెక్​ పెట్రోల్​ ఇంజిన్​ 119 హెచ్​పీ పవర్​ను, 145 ఎన్​ఎం టార్క్​ను ఉత్పత్తి​ చేస్తుంది. 6 స్పీడ్​ మేన్యువల్​, సీవీటీ గేర్​బైక్స్​ దీని సొంతం. మేన్యువల్​ మైలేజ్​ 15.3గా​, సీవీటీ వేరియంట్​ మైలేజ్​ 16.92 KMPL​గా సంస్థ ప్రకటించింది. ఇవే ధరలు : ఎస్​వీ ఎంటీ రూ.10.99 లక్షలు వీఎక్స్​ ఎంటీ రూ. 13,49,000 జెడ్​ఎక్స్​ రూ.14,89,900 వీఎక్స్​ సీవీటీ రూ.14,59,900 జెడ్​ఎక్స్​- రూ.15,99,900 హోండా​కు SUV మోడల్ లో వచ్చిన తొలి సెగ్మెంట్​ ఇదే కావడంతో ఎలివేట్​ ఎస్​యూవీ డెలివరీలను మొదలుపెట్టింది. హోండా ఎలివేట్​ ఎస్​యూవీ మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా, హ్యుందాయ్​ క్రేటా మోడల్స్​కు గట్టి పోటీనివ్వనున్నట్లు అంచనా.