LOADING...
Honda Motorcycle: ఫిబ్రవరిలో హోండా దూకుడు.. 34% వృద్ధితో 5.67 లక్షల అమ్మకాలు
ఫిబ్రవరిలో హోండా దూకుడు.. 34% వృద్ధితో 5.67 లక్షల అమ్మకాలు

Honda Motorcycle: ఫిబ్రవరిలో హోండా దూకుడు.. 34% వృద్ధితో 5.67 లక్షల అమ్మకాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 02, 2026
03:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) ఫిబ్రవరి 2026లో అమ్మకాల పరంగా గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. మొత్తం 5,67,351 యూనిట్లను విక్రయించినట్లు సంస్థ వెల్లడించింది. ఇందులో దేశీయంగా 5,13,190 యూనిట్లు అమ్ముడవగా, ఎగుమతులు 54,161 యూనిట్లుగా నమోదయ్యాయి. గత సంవత్సరం ఫిబ్రవరి నెలతో పోలిస్తే 34 శాతం వృద్ధి సాధించినట్లు తెలిపింది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో తమ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్నట్టే ఈ ఫలితాలు చెబుతున్నాయని కంపెనీ పేర్కొంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(ఏప్రిల్ 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు)గణాంకాలను పరిశీలిస్తే, మొత్తం 58,20,556 యూనిట్లు విక్రయించినట్లు వెల్లడించింది. ఇందులో దేశీయ అమ్మకాలు 52,37,169యూనిట్లు కాగా,ఎగుమతులు 5,83,387యూనిట్లుగా ఉన్నాయి.

వివరాలు 

సేఫ్టీ ఫర్ ఎవ్రీవన్

అమ్మకాలతో పాటు రోడ్డు భద్రతపై కూడా హోండా ప్రత్యేక దృష్టి సారించింది. "సేఫ్టీ ఫర్ ఎవ్రీవన్" కార్యక్రమం కింద అజ్మేర్, పుణే, నాసిక్, నర్నౌల్, వడోదరా, హిసార్, గోరఖ్‌పూర్, కతిహార్, ఔరంగాబాద్, మంగళూరు, ఛింద్వారా, కొచ్చి నగరాల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. బాధ్యతాయుతంగా వాహనాలు నడపడం, రోడ్డు నియమాలు పాటించడం వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించింది.

వివరాలు 

మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా.. ప్రత్యేక శిక్షణ పొందిన సేల్స్, సర్వీస్ బృందం

అలాగే గ్వాలియర్, కొచ్చి, ఆగ్రా, మధురై నగరాల్లో రోడ్ సేఫ్టీ సదస్సులు నిర్వహించి, పాఠశాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులను భాగస్వాములుగా చేసుకుని చిన్నప్పటి నుంచే పిల్లల్లో రోడ్డు భద్రత అలవాట్లు పెంపొందించే చర్యలు చేపట్టింది. చెన్నై, జైపూర్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ పార్కుల వార్షికోత్సవాలను కూడా నిర్వహించింది. అంతేకాకుండా అసోంలోని తిన్సుకియాలో కొత్త అధీకృత డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. ప్రత్యేక శిక్షణ పొందిన సేల్స్, సర్వీస్ బృందంతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సంస్థ వెల్లడించింది.

Advertisement