Page Loader
Honda Activa ev: భారతదేశంలో హోండాActiva e, QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ల ఆవిష్కరణ.. రేంజ్, ఫీచర్లు తెలిస్తే మతిపోవాల్సిందే!
భారతదేశంలో హోండాActiva e, QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ల ఆవిష్కరణ

Honda Activa ev: భారతదేశంలో హోండాActiva e, QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ల ఆవిష్కరణ.. రేంజ్, ఫీచర్లు తెలిస్తే మతిపోవాల్సిందే!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2024
01:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ స్కూటర్ ఇండియా దేశీయ మార్కెట్లో తొలిసారిగా విద్యుత్ స్కూటర్లను ఆవిష్కరించింది. యాక్టివా ఈ (Activa e), క్యూసీ 1 (QC1) పేరుతో రెండు కొత్త మోడళ్లను విడుదల చేసింది. ఎప్పటినుంచో యాక్టివా ఈవీ పట్ల చర్చలు కొనసాగుతుండగా, వాటికి అధికారికంగా తెరదించింది. ఈ స్కూటర్లలో యాక్టివా ఈ స్వాపబుల్‌ బ్యాటరీతో అందుబాటులోకి వస్తుండగా, క్యూసీ 1 ఫిక్స్‌డ్‌ బ్యాటరీతో లభిస్తోంది.

వివరాలు 

యాక్టివా ఈ: కొత్త తరహా డిజైన్ 

హోండా, తన ప్రసిద్ధ స్కూటర్ పేరు అయిన యాక్టివాకి కొత్త రంగు పూస్తూ యాక్టివా ఈ ను విడుదల చేసింది. డిజైన్‌లో స్వల్ప మార్పులతో పాటు, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌ మరియు సైడ్‌ ఇండికేటర్లను మరింత ఆకర్షణీయంగా మలిచింది. ఈ స్కూటర్‌లో రెండు 1.5 కిలోవాట్‌ అవర్‌ బ్యాటరీలు అమర్చబడ్డాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 102 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. టాప్‌ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు. మూడు రైడింగ్‌ మోడ్‌లు - స్టాండర్డ్‌, స్పోర్ట్‌, ఎకానమీ - అందుబాటులో ఉన్నాయి.

వివరాలు 

క్యూసీ 1: తక్కువ దూరం ప్రయాణాల కోసం

హోండా క్యూసీ 1 తక్కువ దూర ప్రయాణాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. యాక్టివా డిజైన్‌ వలే ఉన్నప్పటికీ, ఇందులో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్ లేవు. ఇది 1.5 కిలోవాట్‌ అవర్‌ ఫిక్స్‌డ్‌ బ్యాటరీ ప్యాక్‌ తో వస్తోంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది, టాప్‌ స్పీడ్ గంటకు 50 కిలోమీటర్లు మాత్రమే. 5 అంగుళాల ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

వివరాలు 

విడుదల వివరాలు 

ఈ స్కూటర్ల బుకింగ్స్ 2025 జనవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ధరల వివరాలు కూడా అప్పట్లో ప్రకటించనున్నారు. హోండా ఈ స్కూటర్ల ఉత్పత్తిని బెంగళూరుకు సమీపంలోని తన ప్లాంట్‌లో ప్రారంభించనుంది. ఈ మోడళ్లు టీవీఎస్ ఐక్యూబ్, హీరో విదా, బజాజ్ చేతక్, ఏథర్, ఓలా ఎస్1 ప్రో వంటి పాపులర్ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనున్నాయి. హోండా తన వినూత్నమైన విద్యుత్ స్కూటర్ల ద్వారా భారత మార్కెట్లో తన ప్రాధాన్యతను మరింత పెంచేందుకు సిద్ధమవుతోంది. స్వాపబుల్ బ్యాటరీ వంటి టెక్నాలజీ వినియోగంతో వినియోగదారులను ఆకర్షించనుంది.