Page Loader
Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం
745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం

Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం

వ్రాసిన వారు Jayachandra Akuri
May 21, 2025
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తాజాగా తన అత్యాధునిక మ్యాక్సీ స్కూటర్ ఎక్స్-ఏడీవీ 750ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ మోడల్‌ను కంపెనీ 2022లోనే నేమ్ ప్లేట్ పేటెంట్ నమోదు చేయడం గమనార్హం. అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిళ్ల నుంచి ప్రేరణ పొందిన ఈ స్కూటర్ విడుదల ఇండియన్ మార్కెట్‌లో ఆశ్చర్యానికి గురిచేసింది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 11.90 లక్షలుగా నిర్ణయించారు.

Details

బుకింగ్స్ ప్రారంభం - డెలివరీ జూన్ నుంచి

కొత్త ఎక్స్-ఏడీవీ 750 స్కూటర్ బుకింగ్స్ ఇప్పటికే బిగ్ వింగ్ డీలర్‌షిప్‌లలో అందుబాటులోకి వచ్చాయి. జూన్ 2025 నుండి స్కూటర్ల డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ప్రీమియం స్కూటర్ విభాగంలో తమ నూతన మోడళ్లను ప్రవేశపెట్టాయి. యమహా ఏరోక్స్ 155, బిఎండబ్ల్యూ సి 400 జిటి లాంటి స్కూటర్లు భారత మార్కెట్‌కు కొత్త దిశను సూచిస్తున్నాయి.

Details

ఇంజిన్, పనితీరు, గేర్‌బాక్స్ 

హోండా ఎక్స్-ఏడీవీ 750 లో లిక్విడ్ కూల్డ్ 745 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 6,250 RPM వద్ద 54 BHP పవర్, 4,750 RPM వద్ద 68 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉండడం ప్రత్యేక ఆకర్షణ. వివిధ భూభాగాలకు అనుగుణంగా రూపొందించిన ఈ మోడల్, రైడ్‌కు అనువైన ఫీచర్లతో రుచికరంగా ఉంది. డ్రైవింగ్ మోడ్లు, సేఫ్టీ టెక్నాలజీ ఈ స్కూటర్‌లో హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ సదుపాయంతోపాటు, స్టాండర్డ్, స్పోర్ట్, రెయిన్, గ్రావెల్ అనే నాలుగు రైడింగ్ మోడ్లు ఉన్నాయి. రైడ్-బై-వైర్ థ్రోటిల్ ద్వారా యూజర్ కు స్వంతంగా సెట్టింగులు మార్చుకునే కస్టమ్ మోడ్ కూడా అందుబాటులో ఉంది.

Details

 ఫీచర్లు, రంగు ఎంపికలు 

5 అంగుళాల బ్లూటూత్ TFT డిస్‌ప్లే, స్మార్ట్ కీ, స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్, 22 లీటర్ల సీటు కింద స్టోరేజ్, యుఎస్బి ఛార్జింగ్ పోర్ట్, 1.2 లీటర్ల గ్లోవ్ బాక్స్, సెంటర్ స్టాండ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. భారత మార్కెట్‌లో ఈ స్కూటర్ పెర్ల్ గ్లేర్ వైట్, గ్రాఫైట్ బ్లాక్ అనే రెండు రంగులలో మాత్రమే లభిస్తుంది.

Details

 ఐకానిక్ బిల్డ్ & బ్రేకింగ్ సిస్టమ్ 

హోండా ఎక్స్-ఏడీవీ 750లో ట్యూబులార్ స్టీల్ ఫ్రేమ్ ఉంటుంది. ముందు భాగంలో 41 మిమీ USD ఫోర్కులు, వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ ఉంది. ఇది 17 అంగుళాల ముందు, 15 అంగుళాల వెనుక స్పోక్ వీల్స్ తో ఆఫ్-రోడ్ మరియు పేవ్డ్ రోడ్లకూ అనుకూలంగా ఉంటుంది. బ్రేకింగ్ కోసం ముందుభాగంలో 296 మిమీ డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, వెనుక భాగంలో 240 మిమీ డిస్క్ అందించారు. వీటికి డ్యూయల్ ఛానల్ ABSతో సహకారం ఉంది.