TVS Maxi scooter: ప్రీమియం స్కూటర్లకు భారీ పోటీ.. టీవీఎస్ కూడా ఎంట్రీకి సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
స్కూటర్ అనేది ఒకప్పుడు ప్రధానంగా ఫ్యామిలీ టూ-వీలర్‌గా మాత్రమే ఉపయోగించబడేది. అయితే ఇటీవల కాలంలో స్కూటర్ల రూపం పూర్తిగా మారిపోయింది. పనితీరు, డిజైన్ పరంగా వీటి సామర్థ్యం గణనీయంగా పెరిగింది. కుర్రతరాన్ని ఆకట్టుకునేలా కంపెనీలు స్టైలిష్ లుక్‌తో పాటు పవర్‌ఫుల్ ఇంజిన్ కలిగిన మ్యాక్సీ స్కూటర్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. ఈ దిశగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ కూడా అడుగులు వేస్తోంది. ఇప్పటికే యమహా ఏరోక్స్ 155, హీరో జూమ్ 160 వంటి మోడళ్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక త్వరలో హోండా కూడా ADV160 పేరుతో కొత్త స్కూటర్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. దీంతో ప్రీమియం మ్యాక్సీ స్కూటర్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తోంది.
వివరాలు
160 సీసీతో రానున్న స్కూటర్
ప్రస్తుతం టీవీఎస్ కంపెనీ జూపిటర్, ఎన్‌టార్క్ స్కూటర్లను విక్రయిస్తోంది. వీటిలో స్పోర్టీ డిజైన్‌తో ఉండే ఎన్‌టార్క్ యువతలో మంచి క్రేజ్ సంపాదించింది. ఇదే క్రమంలో కంపెనీ ఎన్‌టార్క్ 150 సీసీ వేరియంట్‌ను కూడా లాంచ్ చేసింది. ఇప్పుడు మరింత శక్తివంతమైన ఇంజిన్‌తో 160 సీసీ మ్యాక్సీ స్కూటర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త స్కూటర్‌ను పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై రూపొందిస్తున్నారని తెలుస్తోంది. లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో ఇది టీవీఎస్ పోర్ట్‌ఫోలియోలోనే అత్యాధునిక స్కూటర్‌గా నిలవనుంది.
వివరాలు
వచ్చే ఏడాది మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం
యమహా ఏరోక్స్ 155, హీరో జూమ్ వంటి మోడళ్లకు గట్టి పోటీగా ఈ 160 సీసీ మ్యాక్సీ స్కూటర్ రాబోతోందని సమాచారం. అధిక వీల్‌బేస్‌తో పాటు బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ సపోర్ట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. వచ్చే ఏడాది ఈ కొత్త టీవీఎస్ మ్యాక్సీ స్కూటర్ మార్కెట్‌లోకి విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.