Yamaha FZ-S Fi: యమహా నుంచి హైబ్రిడ్ బైక్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
బైక్ ప్రియుల కోసం యమహా మరో అద్భుతమైన మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
యూత్‌ను ఆకర్షించే ఆకట్టుకునే డిజైన్, ఆధునిక ఫీచర్లతో యమహా FZ-S Fi హైబ్రిడ్ అత్యుత్తమ ఎంపికగా మారుతోంది.
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'యమహా' భారత మార్కెట్లో కొత్త బైకులను విడుదల చేస్తూ, వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
తాజాగా హైబ్రిడ్ టెక్నాలజీతో తొలిసారిగా బైక్‌ను ప్రవేశపెట్టింది. 150 సీసీ సెగ్మెంట్‌లో తొలిసారిగా 'FZ-S Fi హైబ్రిడ్ బైక్'ను లాంచ్ చేసింది.
Details
బైక్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
శక్తివంతమైన ఇంజిన్ - 149 సీసీ సామర్థ్యం గల బ్లూ కోర్ ఇంజిన్
ప్రారంభ ధర - రూ.1,44,800 (ఎక్స్-షోరూమ్)
టెక్నాలజీ - స్మార్ట్ మోటార్ జనరేటర్, స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్
ఫ్యూయల్ ట్యాంక్ - 13 లీటర్ల సామర్థ్యం
సేఫ్టీ - సింగిల్ ఛానల్ ABS
డిజిటల్ కనెక్టివిటీ - 4.2-అంగుళాల ఫుల్ కలర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, Y-కనెక్ట్ యాప్
నావిగేషన్ - టర్న్-బై-టర్న్ నావిగేషన్, గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేషన్
కలర్ వేరియంట్లు - రేసింగ్ బ్లూ, సియాన్ మెటాలిక్ గ్రే
Details
యమహా అధికారిక వెబ్ సైట్లో బుకింగ్స్
ఈ కొత్త బైక్ టీవీఎస్ అపాచీ, హీరో ఎస్ట్రీమ్, హోండా యూనికాన్, బజాజ్ పల్సర్ వంటి మోడళ్లకు గట్టిపోటీనివ్వనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
బుకింగ్‌లు యమహా అధికారిక వెబ్‌సైట్, అధీకృత డీలర్‌షిప్‌ల వద్ద ప్రారంభమయ్యాయి.
యమహా అభిమానులకు ఇది మరో కొత్త ఆసక్తికరమైన వాహన ఎంపికగా మారనుంది.