Page Loader
ఆటో ఎక్స్‌పో 2023లో హైడ్రోజన్-శక్తితో పనిచేసే Euniq 7ను ఆవిష్కరించిన MG మోటార్
హైడ్రోజన్-శక్తితో పనిచేసే MPV Euniq 7

ఆటో ఎక్స్‌పో 2023లో హైడ్రోజన్-శక్తితో పనిచేసే Euniq 7ను ఆవిష్కరించిన MG మోటార్

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 13, 2023
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటిష్ సంస్థ MG మోటార్ దాని పూర్తి-పరిమాణ MPV Euniq 7ను ఆటో ఎక్స్‌పో 2023లో విడుదల చేసింది. ఇది వివిధ గ్లోబల్ మార్కెట్‌లలో అందుబాటులో ఉన్న హైడ్రోజన్-శక్తితో పనిచేసే Maxus Euniq 7 వ్యాన్ రీ-బ్యాడ్జ్ వెర్షన్. ఇది పర్యావరణ అనుకూల వాహనం. MG 2019లో భారతీయ మార్కెట్లో హెక్టర్‌తో ప్రారంభించింది. ఇది ఫీచర్-ప్యాక్డ్ మిడ్-సైజ్ SUV ఆఫర్ కోసం చూస్తున్న కొనుగోలుదారులను బాగా ఆకర్షించింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ప్రమోషన్స్ మొదలుపెట్టిన బ్రాండ్స్ లో ఒకటి. కాలుష్య రహిత భవిష్యత్తు పట్ల తన నిబద్ధతను ప్రదర్శించడానికి, ఇప్పుడు Euniq 7ని ప్రవేశపెట్టింది. MG Euniq 7 డిజైన్ చేసిన బానెట్, స్లిమ్ LED హెడ్‌లైట్‌లతో ఒక సాధారణ MPVలాగా ఉంటుంది.

మార్కెట్

MPV Euniq 7 భారతీయ మార్కెట్ కోసం కాదు

MG Euniq 7 ఒక లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ 6.4kg హైడ్రోజన్ సిలిండర్‌తో కనెక్ట్ ఎలక్ట్రిక్ మోటార్ నుండి శక్తిని తీసుకుంటుంది. ఇది 605కిమీల వరకు నడుస్తుంది. లోపల విశాలమైన సెవెన్-సీటర్ క్యాబిన్‌, మినిమలిస్ట్ డ్యూయల్-టోన్ డ్యాష్‌బోర్డ్, ప్రీమియం లెదర్ అప్హోల్స్టరీ, వెంటిలేటెడ్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, వెనుక AC వెంట్‌లతో ఉన్న మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ సన్‌రూఫ్‌లు, మల్టీఫంక్షనల్ ఫీచర్లు ఉన్న స్టీరింగ్ వీల్ ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత కోసం ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS ఫంక్షన్‌ అందుబాటులో ఉంటాయి. ధర వివరాలను వాహన తయారీదారు వెల్లడించలేదు, ఎందుకంటే MPV భారతీయ మార్కెట్ కోసం కాదు. ఆటో ఎక్స్‌పోలో సాధారణ ప్రజల చూపించే ఆసక్తిని అంచనా వేయడానికి ప్రదర్శిస్తున్నారు.