Page Loader
ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ కు సిద్దమైన MG 4 EV
MG 4 గత ఏడాది జూలైలో గ్లోబల్ మార్కెట్‌ లో లాంచ్ అయింది

ఆటో ఎక్స్‌పో 2023లో లాంచ్ కు సిద్దమైన MG 4 EV

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 05, 2023
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ MG మోటార్ సరికొత్త ఎలక్ట్రిక్ వాహనం 2023 MG 4ని ఈ నెలలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో భారతదేశంలో ఆవిష్కరించేందుకు సిద్ధమైంది.MG 4 గత ఏడాది జూలైలో గ్లోబల్ మార్కెట్‌ లో లాంచ్ అయింది. MG మోటార్ ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్‌లో ముందంజలో ఉంది. ఈ బ్రాండ్ అత్యంత ప్రశంసలు పొందిన మాడ్యులర్ స్కేలబుల్ ప్లాట్‌ఫారమ్ (MSP) ఆధారంగా కొత్త బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల్నిఅభివృద్ధి చేస్తోంది. ఇది రెండు ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లతో వస్తుంది. 350కిలోమీటర్లు ప్రయాణం చేయగల 51kWh బ్యాటరీ ప్యాక్‌, 450కిమీలు ప్రయాణం చేయగల 64kWh బ్యాటరీ ప్యాక్‌. ఈ కారులో ఫుల్ లెంగ్త్ గ్లాస్ రూఫ్, ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి

MG 4

ఆటో ఎక్స్‌పోలో వచ్చే స్పందన బట్టి ధర నిర్ణయించే అవకాశం

2023 MG 4 మస్కులర్ హుడ్, స్వెప్ట్-బ్యాక్ LED హెడ్‌లైట్‌లు, ఇంటిగ్రేటెడ్ DRLలు, సిల్వర్డ్ స్కిడ్ ప్లేట్లు, స్లోపింగ్ రూఫ్‌లైన్, విశాలమైన ఎయిర్ డ్యామ్‌ తో భవిష్యత్తులో ఉపయోగపడే డిజైన్ తో వస్తుంది. లోపల, ఒక విశాలమైన ఐదు-సీట్ల క్యాబిన్‌ను కలిగి ఉంది, మినిమలిస్ట్ ఆల్-బ్లాక్ డ్యాష్‌బోర్డ్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వంటి సౌకర్యాలతో వస్తుంది. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో ఉన్న ఫ్రీ-స్టాండింగ్ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఇందులో ఉంది. MG మోటార్ భారతదేశంలో MG 4 EVకు ఆటో ఎక్స్‌పోలో వచ్చే స్పందన బట్టి ధర నిర్ణయించవచ్చు. ఇది UKలో £25,995 (సుమారు రూ. 25.93 లక్షలు) నుండి ప్రారంభమవుతుంది.