Loading...
Hyundai Alcazar Lounge: కొత్త హ్యుందాయ్‌ అల్కజార్‌ లాంజ్‌ ఎడిషన్‌.. ప్రత్యేకతలు ఇవే..
కొత్త హ్యుందాయ్‌ అల్కజార్‌ లాంజ్‌ ఎడిషన్‌.. ప్రత్యేకతలు ఇవే..

Hyundai Alcazar Lounge: కొత్త హ్యుందాయ్‌ అల్కజార్‌ లాంజ్‌ ఎడిషన్‌.. ప్రత్యేకతలు ఇవే..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2026
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

హ్యుందాయ్‌ తన ప్రముఖ ఎస్‌యూవీ అల్కజార్‌లో కొత్త వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. 'లాంజ్‌ ఎడిషన్‌' పేరుతో వచ్చిన ఈ ప్రత్యేక వేరియంట్‌ ప్రారంభ ధర రూ.21.80 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా ఉంది. అల్కజార్‌లో తొలిసారిగా ఐదు సీట్ల లేఅవుట్‌ను ఈ ఎడిషన్‌లో అందిస్తోంది. ఈ లాంజ్‌ ఎడిషన్‌లో ప్రధాన ఆకర్షణగా 'హ్యుందాయ్‌ రియర్‌ సీట్‌ ఎక్స్‌పీరియన్స్‌ (RSE)' ప్యాకేజీని అందించారు. వెనుక సీటులో ప్రయాణికులకు మరింత సౌకర్యం, వినోదాన్ని అందించేలా ఇందులో పలు మార్పులు చేశారు. ముందు సీటు వెనుక భాగంలో 11.6అంగుళాల స్క్రీన్‌ను అమర్చారు. దీని ద్వారా ఓటీటీ కంటెంట్‌ చూడటం, గేమ్స్‌ ఆడటం, ఫోన్‌ను మిర్రర్‌ చేయడం వంటి సదుపాయాలను ఉపయోగించుకోవచ్చు.

వివరాలు 

గోల్డెన్‌ బ్రాంజ్‌ రంగులో అల్కజార్‌ లాంజ్‌ ఎడిషన్

ఇందులో ప్రత్యేక యాప్‌ స్టోర్‌ కూడా ఉంది. ఈ స్క్రీన్‌ను 8 స్పీకర్ల బోస్‌ సౌండ్‌ సిస్టమ్‌తో అనుసంధానించారు.

అల్కజార్‌ లాంజ్‌ ఎడిషన్‌ను గోల్డెన్‌ బ్రాంజ్‌ రంగులో అందిస్తున్నారు.

దీనికి బ్లాక్‌ స్కిడ్‌ ప్లేట్లు, సైడ్‌ సిల్‌ గార్నిష్‌, రియర్‌ స్పాయిలర్‌, రూఫ్‌ రైల్స్‌, సీ-పిల్లర్‌, ఓఆర్‌వీఎం గార్నిష్‌ వంటి మార్పులు చేశారు.

మ్యాట్‌ బ్లాక్‌ అల్లాయ్‌ వీల్స్‌, సిల్వర్‌ కలర్‌ ఇంటీరియర్‌ ఇన్‌సర్ట్స్‌ ద్వారా వాహనానికి మరింత ప్రీమియం లుక్‌ ఇచ్చారు.

క్యాబిన్‌లో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం మూన్‌వైట్‌ యాంబియంట్‌ లైటింగ్‌ను అందించారు. వాయిస్‌ కమాండ్‌తో పనిచేసే పనోరమిక్‌ సన్‌రూఫ్‌ కూడా ఇందులో ఉంది.

వివరాలు 

సీట్లపై లాంజ్‌ బ్రాండింగ్

వెనుక సీట్లలో ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించేలా కొత్త సీట్‌ డిజైన్‌ను తీసుకొచ్చారు.

సీట్లపై లాంజ్‌ బ్రాండింగ్‌తో పాటు కుషన్లను కూడా అందించారు.

ఇక ఇంజిన్‌ విషయానికి వస్తే.. అల్కజార్‌ లాంజ్‌ ఎడిషన్‌ను కేవలం డీజిల్‌ ఇంజిన్‌తో మాత్రమే అందిస్తున్నారు.

ఈ వేరియంట్‌ అల్కజార్‌లోని టాప్‌-ఎండ్‌ సిగ్నేచర్‌ వేరియంట్‌ ఆధారంగా రూపొందింది.

ఇందులోని డీజిల్‌ ఇంజిన్‌ 114 హెచ్‌పీ గరిష్ఠ శక్తిని, 250 ఎన్ఎం పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్‌ వాహనాలను ఇష్టపడే వారికి ఈ ప్రత్యేక ఎడిషన్‌ ఆకట్టుకునే అవకాశం ఉంది.

ADVERTISEMENT