Hyundai i20 facelift : అద్భుత ఫీచర్లతో హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్ వేరియంట్లు.. ప్రారంభ ధర ఎంతంటే?
2023 హ్యుందాయ్ ఐ20 మోడల్‌ను ఇటీవలే లాంచ్ అయింది. వీటి ఎక్స్ షో రూం ధరలు రూ. 6.99 లక్షలు- రూ.11.16 లక్షల మధ్యలో ఉంటాయని ప్రముఖ దిగ్గజ ఆటో మొబలై సంస్థ హ్యుందాయ్ స్పష్టం చేసింది. ఈ తరుణంలో ఈ వెహికల్ వేరియంట్లు, వాటి ఫీచర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హ్యుందాయ్ ఐ 20 మాగ్నా ఎరా వేరియంట్‌లో ఉన్న ఇంజిన్ ను ఇందులో ఏర్పాటు చేశారు. ఎరా ఉన్న ఫీచర్లు మొత్తం ఇందులో ఉన్నాయి. దానికంటే అదనంగా ఆటోమెటిక్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 15 ఇంచ్ స్టీల్ వీల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టెబుల్ ఓఆర్వీఎంలు, షార్క్‌ఫిన్ రూఫ్ యాంటీనా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టెమ్, ఫోల్డెబుల్ కీ వంటివి వస్తున్నాయి.
హ్యుందాయ్ ఐ20లో ఎరాలో ఆరు ఎయిర్ బ్యాగులు
హ్యుందాయ్ ఐ20 ఎరా హ్యుందాయ్ ఐ 20 ఫేస్ లిఫ్ట్ వర్షెన్ లో ఎరా అనేది బేస్ మోడల్ గా ఉంది.ఇది 5 స్పీడ్ మేన్యువల్ గేర్ బాక్స్ తో పాటు 1. 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో రానుంది. 6ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబులిటీ కంట్రోల్, హిల్- స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, సీట్‌బెల్ట్ ప్రీ-టెన్షనర్, చైలడ్ సీట్ యాంకర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ లతో ముందుకొస్తోంది. హ్యుందాయ్ ఐ20 స్పోర్ట్‌జ్ మగ్నా వేరియంట్లో వచ్చే ఫీచర్స్‌తో పాటు ఇందులో అదనంగా 16 ఇంచ్ డ్యూయెల్టోన్ స్టీల్ వీల్స్, వింగ్ మిర్రర్స్‌పై టర్న్ ఇండికేటర్స్, టెయిల్‌ల్యాంప్స్ వస్తున్నాయి. మేన్యువల్, ఐవీటీ గేర్ బాక్స్ ఆప్షన్లు వంటివి రానున్నాయి.
టాప్ ఎండ్ మోడల్ గా హ్యుందాయ్ ఐ20 ఆస్టా
హ్యుందాయ్ ఐ20 ఆస్టా హ్యుందాయ్ ఐ 20లో ఇది రెండో టాప్ ఎండ్ మోడల్ గా ఆస్టా ఉంది. ఇందులో స్పోర్ట్ జ్ లోని వేరియంట్స్ తో పాటు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ఎల్ఈడీ డీఆర్ఎల్, స్మార్ట్ కీ, 16 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లతో అద్భుతంగా తీర్చిదిద్దారు. హ్యుందాయ్ ఐ 20 ఆస్టా(ఓ) ఇది ఐ20లో టాప్ఎండ్ మోడల్, ఇందులో మేన్యువల్, ఐవీటీ గేర్ బాక్స్ రానున్నాయి. ఆస్టా వేరియంట్లోని ఫీచర్స్ అన్ని ఇందులో ఉన్నాయి. అదనంగా వాయిస్ ఎనేబుల్డ్ స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, హైట్- అడ్జెస్టెబుల్ సీట్స్, రేర్ సీట్ అడ్జెస్టెబుల్ హెడ్‌రెస్ట్స్, నేవిగేషన్ సిస్టెమ్లు లభిస్తున్నాయి.