LOADING...
Hyundai Venue: హ్యుందాయ్ వెన్యూ 2025 కొత్త మోడల్.. స్టైలిష్ డిజైన్, ప్రీమియం ఫీచర్లు!
హ్యుందాయ్ వెన్యూ 2025 కొత్త మోడల్.. స్టైలిష్ డిజైన్, ప్రీమియం ఫీచర్లు!

Hyundai Venue: హ్యుందాయ్ వెన్యూ 2025 కొత్త మోడల్.. స్టైలిష్ డిజైన్, ప్రీమియం ఫీచర్లు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 15, 2025
03:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

హ్యుందాయ్ తన అత్యంత శక్తివంతమైన ఎస్‌యూవీ వెన్యూ సిరీస్‌లో భారీ అప్‌డేట్‌తో కొత్త వెర్షన్‌ను విడుదల చేయనుంది. పలు నివేదికల ప్రకారం, ఈ కొత్త వెన్యూ 2025 నవంబర్ 4న ఇండియన్ మార్కెట్‌లోకి అడుగుపెడుతుంది. అదేవిధంగా కొత్త వెన్యూ సిరీస్‌లో 'ఎన్' లైన్ అనే కొత్త మోడల్ కూడా లాంచ్ చేయనుంది.

Details

ఎక్స్‌టీరియర్ డిజైన్

కొత్త వెన్యూ మొత్తం స్టైలిష్ లుక్‌తో ఉంటుంది. పాత వెన్యూ కంటే మరింత డైనమిక్, ఆధునిక డిజైన్ ఆకర్షణ కలిగిస్తుంది. ముఖ్య ఫీచర్లు: ఏరో డైనమిక్ ఎక్స్‌టీరియర్ డిజైన్ కొత్త అలాయ్ వీల్స్ అప్‌డేట్ చేసిన LED టెయిల్ ల్యాంప్స్ రూఫ్ రైల్స్

Details

ఇంటీరియర్ ఫీచర్స్

కొత్త వెన్యూ ఇంటీరియర్ పూర్తిగా ఆధునీకరించబడింది. ఫీచర్లు కర్వ్‌డ్ డిస్‌ప్లే డాష్‌బోర్డ్ పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కలర్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ సరికొత్త ఎయిర్ వెంట్స్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS)

Details

ఇంజిన్ ఆప్షన్స్

ఇంజిన్ పరంగా, ప్రస్తుత వెన్యూ మోడల్‌లోని ఆప్షన్స్ కొనసాగుతాయని అంచనా. 1.2-లీటర్ పెట్రోల్ 1.0-లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ 1.5-లీటర్ డీజిల్ యూనిట్ కొత్త వెన్యూ ధరలు సుమారు రూ. 8 లక్షల నుండి రూ. 13 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.