Electric cars: 2023లో భారత్‌లో విడుదలైన టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారత్‌లో ఎలక్ట్రిక్ వెహికల్(EV) మార్కెట్ గత కొన్ని సంవత్సరాలుగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. టాటా మోటార్స్, మహీంద్రా వంటి దేశీయ కార్ల తయారీ సంస్థలతో పాటు మెర్సిడెస్-బెంజ్, BMWవంటి విదేశీ దిగ్గజ కంపెనీలు EVమార్కెట్లో సరికొత్త ఫీచర్లతో వాహనాలను తీసుకొస్తూ.. వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. 2023లో ఆయా కంపెనీలు తమ ఈవీ వేరియంట్లను పరిచయం చేశాయి. 2023లో విడుదలైన టాప్-5 ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. MG Comet EV: రూ. 7.98లక్షలు MG Comet EV క్యాబిన్‌లో నాలుగు సీట్లు ఉంటాయి. మాన్యువల్ AC, పవర్ విండోస్, రెండు-టోన్ డాష్‌బోర్డ్, ఫాబ్రిక్ అప్హోల్స్టరీ, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్ దీని సొంతం. విచిత్రంగా కనిపించే ఈ కారు 17.3kWhబ్యాటరీ ప్యాక్‌తో ఉంటుంది.
Tata Nexon.ev: రూ. 14.74 లక్షలు
స్పోర్ట్స్ బంపర్-మౌంటెడ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, సీక్వెన్షియల్ లైటింగ్‌తో కూడిన డీఆర్ఎల్, 16-అంగుళాల వీల్స్ Tata Nexon.ev కారు సొంతం. క్యాబిన్‌లో డ్యూయల్-టోన్ డ్యాష్‌బోర్డ్, టచ్-ఆధారిత బ్యాక్‌లిట్ స్విచ్‌లు, వైర్‌లెస్ ఛార్జర్, 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. Hyundai IONIQ 5: రూ. 45.95 లక్షలు క్లామ్‌షెల్ హుడ్, సొగసైన బ్లాక్ గ్రిల్, స్క్వేర్డ్-అవుట్ డీఆర్ఎల్‌తో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, ఫ్లష్-ఫిట్టెడ్ డోర్ హ్యాండిల్స్, పిక్సలేటెడ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్‌లు Hyundai IONIQ 5 కారులో ఉన్నాయి. ఐదు సీట్ల క్యాబిన్ పవర్-అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, గ్లాస్ రూఫ్, బోస్ సౌండ్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ ప్యానెల్ కోసం రెండు 12.25-అంగుళాల స్క్రీన్‌లను అందిస్తుంది.
Mercedes-Benz EQE SUV: రూ. 1.39 కోట్లు
గ్లోస్ బ్లాక్ క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్, స్వెప్ట్-బ్యాక్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, వెడల్పు ఎల్ఈడీ లైట్ బార్, ఫ్లష్-ఫిట్టెడ్ డోర్ హ్యాండిల్స్ Mercedes-Benz EQE SUVలో ఉన్నాయి. క్యాబిన్‌లో ప్రీమియం అప్హోల్స్టరీ, పవర్డ్ సీట్లు, పనోరమిక్ గ్లాస్ రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్, భారీ 56.0-అంగుళాల MBUX హైపర్‌స్క్రీన్ ఉన్నాయి. BMW i7: రూ. 2.03 కోట్లు BMW i7లో మ్యాట్రిక్స్ LED హెడ్‌లైట్లు, స్ప్లిట్-టైప్ డీఆర్ఎల్‌లు, ఒక ఇల్యూమినేటెడ్ కిడ్నీ గ్రిల్, కెపాసిటివ్ బటన్‌లతో కూడిన ఫ్లష్-ఫిట్టెడ్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్-అవుట్ ఎలిమెంట్స్‌తో ర్యాప్-అరౌండ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్‌లు ఉన్నాయి. రూఫ్-మౌంటెడ్ 31.3-అంగుళాల 8k థియేటర్ స్క్రీన్ దీని సొంతం.