టెస్లా సైబర్‌ట్రక్ ఇంటీరియర్ గురించి ఆసక్తికర విషయాలు లీక్!
ఎలక్ట్రిక్ వాహనాల ప్రపంచంలో రారాజు అంటే కచ్చితంగా టెస్లా పేరు చెప్పాల్సిందే. టెస్లా కారు మార్కెట్లోకి వచ్చిన తర్వాతే ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలకు గిరాకీ పెరిగింది. ఎలక్ట్రిక్ వాహనాల ప్రపచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని టెస్లా దక్కించుకుంది. అలాంటి కంపెనీ నుంచి ఓ కారు వస్తుంది అంటే? దానికి ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా టెస్లా సైబర్ ట్రక్ గురించి ఆన్‌లైన్‌లో ఆసక్తికర విషయాలు లీక్ అయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ వాహనాన్ని ప్రవేశపెట్టాలని టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ సూచించనట్లు సమాచారం. ఈ కారులో క్యాబిన్, డైవర్ సీటు ఎలా రూపొందించారో ఎవ్వరికీ తెలియకపోవడం గమనార్హం.
టెస్లా సైబర్ ట్రక్ ఫీచర్లు
టెస్లా సైబర్‌ట్రక్ ఒక దీర్ఘచతురస్రాకార స్టీరింగ్ వీల్‌తో పాటు అందరి దృష్టిని ఆకర్షించే విధంగా మధ్యలో మముత్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో అద్భుతంగా క్యాబిన్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. టెస్లా సైబర్‌ట్రక్ లోపలి భాగంలో భారీ ల్యాండ్‌స్కేప్-ఓరియెంటెడ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, టర్న్ సిగ్నల్స్ కోసం బటన్‌లతో కూడిన దీర్ఘచతురస్రాకార స్టీరింగ్ వీల్ ఉన్నాయి. ఇతర కార్లలో వలె స్టీరింగ్ ముందు ప్రత్యేక ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిసే ప్లే లేదు. టెస్లా సైబర్‌ట్రక్ క్యాబిన్ గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ట్విన్ బిల్ట్-ఇన్ రోటరీ స్క్రోల్ వీల్స్ ఇతర టెస్లా కార్ల మాదిరిగానే ఉండనున్నాయి.