Jitendra EV Yunik: నెక్స్ట్-జెన్ ఫీచర్లతో జితేంద్ర ఈవీ లాంచ్.. ప్రత్యేకతలు తెలిస్తే షాక్
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ జితేంద్రా ఈవీ,తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ "యూనిక్" ను మార్కెట్‌లో విడుదల చేసింది.
ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1.24 లక్షలు కాగా,డెలివరీలు 2025 జనవరి 15 నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది.
జితేంద్రా కంపెనీ మరో రెండు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లను,"యూనిక్ లైట్","యూనిక్ ప్రో", త్వరలో మార్కెట్‌లో విడుదల చేయాలని యోచిస్తోంది.
యూనిక్ ఈవీ గురించి వివరిస్తే,ఈ స్కూటర్ 3.8 కేడబ్ల్యూ ఎల్ఎంఎఫ్‌పీ రిమూవబుల్ బ్యాటరీతో వచ్చింది.
ఒక్కసారి చార్జ్ చేస్తే,ఈ స్కూటర్ 118 కిమీల పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది.
యూనిక్ ఈవీ స్కూటర్ స్పిన్ స్విచ్ రైడింగ్ మోడల్‌తో,మొదటి హైపర్ గేర్ పవర్ ట్రైన్‌ను కలిగి ఉంటుంది.
వివరాలు
12అంగుళాల ట్యూబ్ లెస్ టైర్లు
జితేంద్రా ఈవీ, యూనిక్ స్కూటర్ గరిష్టంగా 75కిమీ/గం వేగాన్ని అందుకుంటుందని వివరించింది.
యూనిక్ ఈవీ స్కూటర్ డ్యూయల్ డిస్క్ బ్రేకులు,అల్లాయ్ వీల్స్‌తో కూడిన 12అంగుళాల ట్యూబ్ లెస్ టైర్లను కలిగి ఉంటుంది.
రైడర్ భద్రత కోసం సైడ్ స్టాండ్ సెన్సార్లు కూడా అందుబాటులో ఉన్నాయి.కీలెస్ ఎంట్రీ,యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్,అధునాతన డిస్‌ప్లేలతో కూడిన స్మార్ట్ డిజిటల్ ఎల్ఈడీ క్లస్టర్ వంటి ప్రత్యేక ఫీచర్లతో ఈ స్కూటర్ రూపొందించబడింది.
క్రోమ్ ఏఆర్‌సీ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్‌లు,రేడియంట్ హెక్స్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్,ఈగల్ విజన్ బ్లింకర్లతో ఈ స్కూటర్ మరింత ఆకట్టుకుంటుంది.
ముఖ్యంగా,ఈ స్కూటర్ మెరుగైన రైడింగ్ అనుభవం కోసం స్మార్ట్ కనెక్టివిటీ,సహజమైన నియంత్రణలు కలిగి ఉండే జెనీ అప్లికేషన్ కనెక్టివిటీతో బ్లూటూత్ కనెక్టెడ్ బ్యాటరీతో వస్తుంది.
వివరాలు
ఈ స్కూటర్ ఐదు విభిన్న రంగుల్లో లభిస్తుంది
యూనిక్ ఈవీ బ్యాటరీపై మూడు సంవత్సరాలు లేదా 50,000 కిమీ వారెంటీ ఉంటుందని కంపెనీ తెలిపింది.
మీడో గ్రీన్, డస్క్ బ్లూ, ఫారెస్ట్ వైట్, వాల్కనో రెడ్, మరియు ఎక్లిప్స్ బ్లాక్. జితేంద్రా కంపెనీ, ఈ స్కూటర్‌కు ముందుగా రూ.79,999 ధరతో ప్రిమో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.
ప్రిమో ఎలక్ట్రిక్ స్కూటర్ 60వీ, 26ఏహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో ఉంటుంది, ఒకసారి చార్జ్ చేసినా 65 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.
ఈ మోడల్ 7 డిగ్రీ గ్రేడియంట్ సామర్థ్యంతో 52 కేఎంపీహెచ్ గరిష్ట వేగం అందుకుంటుంది.