JSW Combat SUV: ఇండియాలోకి వచ్చేస్తున్న జెఎస్‌డబ్ల్యూ మోటార్స్.. డిసెంబర్ 3న 'కాంబాట్' కారు లాంచ్
ఈ వార్తాకథనం ఏంటి
భారత ప్యాసింజర్ వెహికల్ మార్కెట్‌లోకి JSW Motors అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. JSW గ్రూప్‌కు చెందిన ఈ కొత్త ఆటో మొబైల్ విభాగం తన అధికారిక లోగోను ఆవిష్కరించింది. డిసెంబర్ 3, 2026న సంస్థ భారత్‌లోకి అధికారికంగా ఎంట్రీ ఇవ్వనుండగా, తొలి మోడల్‌గా Combat SUVను పరిచయం చేయనుంది. నలుపు, తెలుపు రంగులతో ప్రధానంగా రూపొందించిన లోగోలో టీలి రంగును సెకండరీ కలర్‌గా ఉపయోగించారు. ప్రపంచ స్థాయి టెక్నాలజీని భారత వినియోగదారులకు అందించడంతో పాటు, దేశంలోనే ఇంజినీరింగ్, తయారీ, స్థానికీకరణ సామర్థ్యాలను పెంచుకోవడం తమ లక్ష్యమని కంపెనీ తెలిపింది.
Details
Jetour T2 ఆధారంగా.. మహారాష్ట్రలో తయారీ
JSW Combat SUV అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న Chery Jetour T2 ఆధారంగా రూపొందుతోంది.
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో ఉన్న JSW తయారీ కేంద్రంలో ఈ SUVని అసెంబుల్ చేయనున్నారు.
కారు పూర్తి డిజైన్‌ను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించకపోయినా, స్పై చిత్రాలు, టీవీసీ షూట్‌కు సంబంధించిన వీడియోల ద్వారా కొన్ని వివరాలు బయటకు వచ్చాయి.
T2తో పోలిస్తే హెడ్‌ల్యాంప్స్, బంపర్లు, అల్లాయ్ వీల్స్, లైటింగ్ డిజైన్‌లో మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది.
ముందు భాగంలో కనిపించే 'Jetour' పేరుకు బదులుగా 'COMBAT' బ్రాండింగ్ ఉండనుంది.
Details
360 హెచ్‌పీ పవర్.. 1,100 కిమీకి పైగా రేంజ్?
Combatలో అత్యంత ఆసక్తికరమైన అంశం దాని ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్.
ఇందులో 1.5 లీటర్ డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 18.4 kWh బ్యాటరీ ఉండనున్నాయి.
ఈ సెటప్ కలిపి 360 hp పవర్, 610 Nm టార్క్ ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం.
3-స్పీడ్ డెడికేటెడ్ హైబ్రిడ్ ట్రాన్స్‌మిషన్ (DHT)తో వచ్చే ఈ SUV ఒక్క బ్యాటరీ ఛార్జ్‌తో సుమారు 90 కిమీ ఎలక్ట్రిక్ రేంజ్ ఇవ్వొచ్చని అంచనా.
70 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో కలిపి మొత్తం రేంజ్ 1,100 కిమీకి పైగా ఉండే అవకాశం ఉంది. దీంతో JSW Motors తొలి అడుగే భారత SUV మార్కెట్‌లో ఆసక్తికరంగా మారింది.