Page Loader
Kawasaki Versys-X 300: భారత్‌లో 2025 కవాసాకి వెర్సిస్-ఎక్స్ 300 లాంచ్.. అడ్వెంచర్ బైక్ !
భారత్‌లో 2025 కవాసాకి వెర్సిస్-ఎక్స్ 300 లాంచ్.. అడ్వెంచర్ బైక్ !

Kawasaki Versys-X 300: భారత్‌లో 2025 కవాసాకి వెర్సిస్-ఎక్స్ 300 లాంచ్.. అడ్వెంచర్ బైక్ !

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2025
02:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియా కవాసాకి మోటార్స్ 2025 మోడల్‌గా వెర్సిస్-ఎక్స్ 300 అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను దేశీయ మార్కెట్లోకి తిరిగి ప్రవేశపెట్టింది. ఈ మోడల్‌కు ధరను రూ. 3.80 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. గతంలో రూ. 4.60 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ చేసిన మోడల్‌తో పోలిస్తే ఇది స్పష్టంగా తక్కువ ధరలో అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త వెర్సిస్-ఎక్స్ 300, కవాసాకి బ్రాండ్‌కు ప్రత్యేకత అయిన అడ్వెంచర్ లక్షణాలను కలిగి ఉండటంతో పాటు, రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా రూపొందించబడింది.

వివరాలు 

2025 కవాసాకి వెర్సిస్-ఎక్స్ 300లో కొత్తదనం ఏమిటి? 

బాహ్య రూపంలో చూస్తే, కొత్త వెర్సిస్-ఎక్స్ 300 గత మోడల్‌కు చాలా హద్దు వరకు సమానంగా ఉంటుంది. అయితే కొత్త 2025 వర్షన్‌లో కొత్తగా బ్లూ మరియు వైట్ కలర్ స్కీమ్‌ను పరిచయం చేశారు. ముఖ్యంగా ఈ బైక్ పూర్తిగా నిర్మిత యూనిట్ (CBU) రూపంలో భారతదేశానికి దిగుమతి అవుతుంది. దీన్నిఇంపోర్టెడ్ మోడల్‌గా తీసుకొచ్చినప్పటికీ, సెగ్మెంట్‌లో మిగతా బైకులతో పోలిస్తే అత్యంత తక్కువ ధరలో లభ్యమవుతోంది.

వివరాలు 

ఇంజిన్, గేర్ బాక్స్, ఇతర స్పెసిఫికేషన్లు 

2025 వెర్సిస్-ఎక్స్ 300లో నింజా 300 మోటార్‌సైకిల్‌లో వాడే 296సీసీ పెరల్-ట్విన్ ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 11,500 ఆర్పిఎమ్ వద్ద 38.5 బిహెచ్పీ పవర్‌ను, 10,000 ఆర్పిఎమ్ వద్ద 26.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు స్లిప్పర్ క్లచ్‌ను జత చేశారు,ఇది మృదువైన గేర్ మార్పులకు తోడ్పడుతుంది. సస్పెన్షన్ వ్యవస్థ విషయానికి వస్తే - ముందు వైపు 130 మిల్లీమీటర్ల ట్రావెల్ కలిగిన 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనుక వైపు 180 మిల్లీమీటర్ల ట్రావెల్ కలిగిన మోనోషాక్ యూనిట్ అమర్చారు. బ్రేకింగ్ వ్యవస్థలో, ముందు, వెనుక రెండింటికీ డిస్క్ బ్రేక్‌లు ఉండగా, డ్యూయల్ ఛానెల్ ఎబిఎస్ వ్యవస్థతో మరింత సురక్షితమైన బ్రేకింగ్‌ను అందిస్తుంది.

వివరాలు 

ఇంజిన్, గేర్ బాక్స్, ఇతర స్పెసిఫికేషన్లు 

ఈ బైక్ 19అంగుళాల ముందు స్పోక్డ్ వీల్స్,17అంగుళాల వెనుక స్పోక్డ్ వీల్స్‌తో వస్తుంది. ఇందులో ట్యూబ్ టైర్లు ఉపయోగించబడ్డాయి. ఇంజిన్‌ను మద్దతు ఇచ్చే బ్యాక్‌బోన్ ఫ్రేమ్‌లో 17లీటర్ల సామర్థ్యం కలిగిన ఇంధన ట్యాంక్ అమర్చారు. ఈ బైక్‌కి 180 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. మొత్తం బైక్ బరువు 184కిలోలుగా ఉంటుంది. మార్కెట్లో పోటీ వెర్సిస్-ఎక్స్ 300కి భారత మార్కెట్లో గట్టి పోటీ ఎదురవుతుంది. ప్రధానంగా ఈ సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450,కెటిఎమ్ 390 అడ్వెంచర్ వంటి పాపులర్ బైకులు ఇప్పటికే ఉన్న నేపథ్యంలో,కొత్త వెర్సిస్ వాటిని గట్టిగా ఢీకొట్టే అవకాశం ఉంది. తక్కువ ధర,విశ్వసనీయమైన పనితీరు,ఆఫ్-రోడ్ సామర్థ్యం వంటి అంశాల కారణంగా ఈ బైక్ ప్రాధాన్యతను సాధించే అవకాశాలు ఉన్నాయి.