
Electric Vehicles: రోడ్డు భద్రత కోసం కీలక నిర్ణయం.. ఎలక్ట్రిక్ వాహనాల్లో తప్పనిసరి ఏవీఏఎస్
ఈ వార్తాకథనం ఏంటి
రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1, 2027 నాటికి అన్ని ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కుల్లో అకౌస్టిక్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ (AVAS)ను తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. మొదట కొత్త వాహనాలకు అమలు మంత్రిత్వ శాఖ జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం అక్టోబర్ 1, 2026 తర్వాత తయారయ్యే అన్ని కొత్త మోడల్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలు, సరుకు రవాణా వాహనాలు AVAS ఫీచర్‌ను కలిగి ఉండాలి. తర్వాతి ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటికే నడుస్తున్న వాహనాలకు కూడా ఇది తప్పనిసరి అవుతుంది.
Details
ఎందుకు అవసరం?
ఎలక్ట్రిక్ వాహనాలు నడుస్తున్నప్పుడు సాధారణ పెట్రోల్, డీజిల్ వాహనాల్లా ఇంజిన్ శబ్దం రాదు. ఈ కారణంగా పాదచారులు, సైక్లిస్ట్‌లు, ఇతర డ్రైవర్లు వాటి రాకను గుర్తించలేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకే AVAS అమలు చేయాలని నిర్ణయించింది కేంద్రం. ఎలా పనిచేస్తుంది? AVAS సిస్టమ్ వాహనం కదులుతున్నప్పుడు కృత్రిమ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. వాహనం వేగాన్ని బట్టి శబ్దం తీవ్రత కూడా మారుతుంది. ఇది అచ్చం ఇంజిన్ శబ్దంలా అనిపిస్తుంది. ఏఐఎస్-173 ప్రమాణాలకు అనుగుణంగా 56 నుంచి 75 డెసిబెల్స్ మధ్య శబ్దం వచ్చేలా రూపొందించబడుతుంది
Details
ఎవరి వాహనాలకు వర్తిస్తుంది?
కేటగిరీ M: ప్రయాణికుల రవాణా కోసం రూపొందించిన ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు కేటగిరీ N: ఎలక్ట్రిక్ ట్రక్కులు, సరుకు రవాణా వాహనాలు ఇప్పటికే ఇతర దేశాల్లో అమలు అమెరికా, జపాన్, యూరోపియన్ యూనియన్‌లోని అనేక దేశాలు ఇప్పటికే హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల్లో ఇటువంటి సౌండ్ అలర్ట్ సిస్టమ్‌ను తప్పనిసరి చేశాయి. రోడ్డుపై ఎలక్ట్రిక్ వాహనాల నిశ్శబ్ద ఉనికి వల్ల కలిగే ప్రమాదాలను నివారించేందుకు భారత్ కూడా ఇలాంటి చర్యలు తీసుకోబోతోంది.