Kia EV4: సెడాన్, హ్యాచ్‌బ్యాక్ వెర్షన్లలో కియా ఈవీ4.. 630 కిమీ రేంజ్, హై-పర్ఫార్మెన్స్ వివరాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
2025 కియా ఈవీ డే సందర్భంగా, కియా తన ఎలక్ట్రిక్ వెహికల్ లైనప్‌ను మరింత విస్తరించేందుకు 'కియా ఈవీ4'ను ఆవిష్కరించింది.
ఈ కొత్త మోడల్ సెడాన్, హ్యాచ్‌బ్యాక్ వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది.
పట్టణ ప్రయాణాల కోసం ఇంకా సుదూర ప్రయాణాలకు ఆచరణాత్మకమైన ఎలక్ట్రిక్ వాహనాన్ని అందించాలనే లక్ష్యంతో కియా ఈవీ4ను అభివృద్ధి చేసింది.
స్టైలిష్ డిజైన్
కియా ఈవీ4 బోల్డ్ లుక్స్‌తో డిజైన్ చేశారు. ముందుభాగంలో వర్టికల్ హెడ్‌లాంప్స్, సిగ్నేచర్ 'టైగర్ ఫేస్' గ్రిల్ వాహనానికి ప్రీమియం లుక్‌ను ఇస్తాయి.
వెనుక భాగంలో సెడాన్ వేరియంట్ టూ-పీస్ స్పాయిలర్‌ను కలిగి ఉండగా, హ్యాచ్‌బ్యాక్ మోడల్ మరింత డైనమిక్ ప్రొఫైల్‌ను అందిస్తుంది.
Details
అల్ట్రా-మోడ్రన్ ఇంటీరియర్.. ఫీచర్లు, టెక్నాలజీ
కియా ఈవీ4 లోపల ఫ్రీ-ఫ్లోటింగ్ యూజర్ ఇంటర్ఫేస్, ఆధునిక ఫీచర్లతో కూడిన స్టీరింగ్ వీల్ ఇంకా రొటేటింగ్ ఆర్మ్ రెస్ట్, స్లైడింగ్ టేబుల్ కన్సోల్, విశాలమైన కార్గో స్పేస్ వంటివి ఉన్నాయి.
వీటి ద్వారా ప్రయాణికులకు అధిక సౌలభ్యం లభిస్తుంది.
పెర్ఫార్మెన్స్ - అధిక శక్తితో తక్కువ ఛార్జింగ్ టైమ్
ఈ మోడల్ 400V ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకుంది. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.
స్టాండర్డ్ బ్యాటరీ: 58.3 kWh
లాంగ్-రేంజ్ బ్యాటరీ: 81.4 kWh
ఒకే ఛార్జ్‌పై డ్రైవింగ్ రేంజ్
Details
31 నిమిషాల్లోనే ఛార్జింగ్
సెడాన్ మోడల్: 630 కిలోమీటర్లు
హ్యాచ్‌బ్యాక్ మోడల్: 590 కిలోమీటర్లు
0-100 కిమీ వేగం: 7.4 సెకన్లు
టాప్ స్పీడ్: 170 కిమీ/గం
ఫాస్ట్ ఛార్జింగ్: 10-80% కేవలం 31 నిమిషాల్లో
ఈ మోడల్‌లో వెహికల్-టు-లోడ్, వెహికల్-టు-గ్రిడ్ ఫీచర్లు ఉంటాయి. వీటివల్ల బాహ్య పరికరాలను పవర్ చేయడం లేదా గ్రిడ్‌లోకి విద్యుత్తును తిరిగి పంపడం సాధ్యమవుతుంది.
Details
డిజిటల్ టెక్నాలజీ, కనెక్టివిటీ
డిజిటల్ కీ సిస్టమ్: స్మార్ట్‌ఫోన్, ఆపిల్ వాచ్ ద్వారా వాహనాన్ని యాక్సెస్ చేయడం.
30 అంగుళాల వైడ్ స్క్రీన్ డిస్‌ప్లే
కియా కనెక్టెడ్ కార్ నావిగేషన్ కాక్‌పిట్
యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ సపోర్ట్
ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు
కియా ఏఐ ఆధారిత వాయిస్ అసిస్టెంట్
Details
అత్యాధునిక భద్రతా వ్యవస్థలు
కియా ఈవీ4లో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది.
హైవే డ్రైవింగ్ అసిస్ట్ 2 (HDA 2)
ఫార్వర్డ్ కొలిషన్ అవాయిడెన్స్ అసిస్ట్
లేన్ ఫాలోయింగ్ అసిస్ట్
డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్
యూరో NCAP, US NCAP క్రాష్ టెస్టులలో 5-స్టార్ రేటింగ్ లక్ష్యం
2025 కియా ఈవీ4 ఆధునిక ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌ను కొత్త దిశలో తీసుకెళ్లే పోటీతత్వ మోడల్.
అధునాతన టెక్నాలజీ, సరికొత్త ఇంటీరియర్ డిజైన్, అత్యధిక రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యంతో ఇది ఎలక్ట్రిక్ విభాగంలో ప్రాధాన్యతను పెంచనుంది.
కియా ఇంకా ఎన్నో సరికొత్త ఆవిష్కరణలకు సిద్ధంగా ఉంది.