త్వరలో లాంచ్ కానున్న కియా EV9 స్టైలిష్ ఎలక్ట్రిక్ SUV
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ కొరియా తయారీసంస్థ కియా మోటార్స్ తన EV9 SUV వెర్షన్‌ను ప్రకటించింది. ఇది 2024 ప్రారంభంలో అందుబాటులోకి వస్తుంది. కారు ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో, మూడు వరుసల సీట్లతో ఉన్న విశాలమైన క్యాబిన్ ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ తో నడుస్తుంది.
కియా EV9 తిరిగి 2021లో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించబడింది. ఇది E-GMP ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడింది, 2027 నాటికి వస్తాయని బ్రాండ్ హామీ ఇచ్చిన 15 ఎలక్ట్రిక్ వాహనాలలో ఇది ఒకటి. ఇది మిడ్-సైజ్, మూడు-వరుసల SUV విభాగంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్-పవర్డ్ మోడల్ అందుకే కొనుగోలుదారుల దృష్టిని బాగా ఆకర్షించే అవకాశం ఉంది. భారతదేశంలో కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది.
కార్
ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 480కిమీల వరకు నడుస్తుంది
కియా EV9 శక్తివంతమైన బ్యాటరీతో, ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో కనెక్ట్ అయిన ఒకటి లేదా రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో వస్తుంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే దాదాపు 480కిమీల వరకు నడుస్తుంది. కియా EV9 మూడు-వరుసలు, 6/7-సీట్ల క్యాబిన్‌తో రెండవ వరుస సీట్లకు స్వివెల్ ఫంక్షన్, రెండు-టోన్ డాష్‌బోర్డ్, పెద్ద సెంటర్ కన్సోల్, రెండు-స్పోక్ మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్ ఉంటాయి.
ఈ EV9 మూడు వరుసల SUV ధర, ఇతర వివరాలను కియా మోటార్స్ ఇంకా వెల్లడించలేదు. అయితే, USలో, ఈ కారు ప్రారంభ ధర దాదాపు $50,000 (దాదాపు రూ. 41.2 లక్షలు)గా ఉండచ్చు.