కియా EV9 v/s వోల్వో EX90 ఏది కొనడం మంచిది
దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ తన EV9 SUVని ఆవిష్కరించింది. ఈ ఏడాది చివరి నాటికి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. మార్కెట్లో ఇది వోల్వో EX90 మోడల్‌తో పోటీపడుతుంది. కియా EV9 ఎలక్ట్రిక్ SUV 5,010mm పొడవు, 1,980mm వెడల్పు ఉంటే మరోవైపు, వోల్వో EX90 పొడవు 5,037mm, వెడల్పు 1,963mm. EV9లో హైవే డ్రైవింగ్ పైలట్ సిస్టమ్, డిజిటల్ కీ 2, లేన్ కీపింగ్ అసిస్ట్, నావిగేషన్ ఆధారిత స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్‌తో ఉన్న ADAS సూట్, ఆరు/ఏడు-సీట్ల క్యాబిన్ ఉంటాయి . వోల్వో EX90లో రెండు-టోన్ డ్యాష్‌బోర్డ్, రీసైకిల్ మెటీరియల్‌లను ఉపయోగించి చేసిన అప్హోల్స్టరీ, ADAS ఫంక్షన్లు, బోవర్స్ & విల్కిన్స్ ఆడియో సిస్టమ్ ఉంటుంది.
సరికొత్త ఫీచర్స్ తో వోల్వో కన్నా కియా మెరుగ్గా ఉంటుంది
కియా EV9 76.1kWh బ్యాటరీతో, 99.8kWh బ్యాటరితో కనెక్ట్ అయిన ఎలక్ట్రిక్ మోటార్ తో నడుస్తుంది. ఒక్కసారి చార్జ్ కు 541కి.మీ. వరకు నడిచే డ్యూయల్-మోటార్ పవర్‌ట్రెయిన్ (380hp/600Nm)తో ఉన్న వేరియంట్ కూడా ఉంది. వోల్వో EX90 483కిమీ వరకు నడిచే 111kWh బ్యాటరీ ప్యాక్‌తో ట్విన్-మోటార్ ఇ-పవర్‌ట్రెయిన్ తో వస్తుంది. USలో, కియా EV9 ధర దాదాపు $56,000 (దాదాపు రూ. 46.1 లక్షలు) ఉంటుంది, అయితే వోల్వో EX90 ధర సుమారు $80,000 (సుమారు రూ. 65.8 లక్షలు) ఉండచ్చు. మెరుగైన రూపం, కొత్త ఫీచర్లతో EV9 మెరుగైన ఎంపిక.